Begin typing your search above and press return to search.

కెమేరాకు దొరికిన గిద్ద‌లూరి ఎమ్మెల్యే య‌వ్వారం

By:  Tupaki Desk   |   10 May 2017 6:12 AM GMT
కెమేరాకు దొరికిన గిద్ద‌లూరి ఎమ్మెల్యే య‌వ్వారం
X
ప‌వ‌ర్‌లో ఉంటే చాలు.. ఏం చేసినా ఎవ‌రూ ఏం చేయ‌లేర‌న్న ధీమా వ‌చ్చేస్తుంది. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా దిగ‌జారే తీరును ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తాజాగా అలాంటి ప‌నే చేసి అడ్డంగా బుక్ అయ్యారు ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ప్ర‌చార కాంక్ష‌.. ప్ర‌భుత్వ నిధుల్ని స్వార్థ ప్ర‌యోజ‌నంకోసం ప‌క్క‌దారి ప‌ట్టించిన వైనం కెమేరాకు దొరికింది.

వేస‌వి కార‌ణంగా స్థానిక ప్ర‌జా అవ‌స‌రాల కోసం ప్ర‌భుత్వం కేటాయించిన నీటి స‌ర‌ఫ‌రాను ట్యాంక‌ర్ల ద్వారా ప‌క్క‌దారి ప‌ట్టించిన వైనం తాజాగా కెమేరా కంటికి చిక్కింది. వాట‌ర్ ట్యాంక‌ర్ పై నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌న ఫోటోను అచ్చేయించుకున్న ఎమ్మెల్యే తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేసే నీటిని ప్ర‌భుత్వ నిధుల‌తో చేస్తున్నా.. అదేదో సొంత నిధుల్ని ఖ‌ర్చు చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకుంటున్న వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేయాల్సిన నీటిని.. స్థానికంగా ఉండే ఒక ప్ర‌ముఖ రెస్టారెంట్‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న వైనం కెమేరా కంటికి దొరికిపోయింది. సామాన్యుల‌కు చెందాల్సిన నీటిని.. వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే ఒక రెస్టారెంట్‌కు స‌ర‌ఫ‌రా చేయ‌టం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఫోటోకు అడ్డంగా దొరికిన ఈ తీరును చూసిన ప‌లువురు ఎమ్మెల్యే య‌వ్వారానికి విస్తుపోతున్నారు.