Begin typing your search above and press return to search.

గిద్ద‌లూరు రాజకీయం గ‌రం గ‌రం.. ఎమ్మెల్యేపై రెడ్డి నేత‌ల తిరుగుబాటు!

By:  Tupaki Desk   |   30 May 2022 8:39 AM GMT
గిద్ద‌లూరు రాజకీయం గ‌రం గ‌రం.. ఎమ్మెల్యేపై రెడ్డి నేత‌ల తిరుగుబాటు!
X
ఏపీలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం జ‌గ‌న్ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన‌ నాయ‌కులే తిర‌గ‌బ‌డుతు న్నారు. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో అయితే..రెడ్డి వ‌ర్గం కారాలు మిరియాలు నూరుతున్నారు.. ఇక్క‌డ నుంచి 2019 ఎన్నిక‌ల్ల అన్నా రాంబాబు.. భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. పులివెందుల‌లో వైఎస్ జ‌గ‌న్ తెచ్చుకున్న ల‌క్ష ఓట్ల మెజారిటీ త‌ర్వాత రాష్ట్రంలో అంత మెజారిటీ ద‌క్కించుకున్న నాయ‌కుడిగా అన్నానే ఉన్నారు.

అయితే.. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. తొలుత ఆయ‌న కాంట్రాక్ట‌ర్‌గా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. ఈ క్ర‌మంలో ప్ర‌జారాజ్యం పార్టీలో చేరిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం.. కొన్నాళ్ల పాటు స్త‌బ్దుగా ఉన్న అన్నా రాంబాబు.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోగా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా టీడీపీ పంచ‌న చేరారు.

2014లో టీడీపీ త‌ర‌ఫున గిద్ద‌లూరులో పోటీ చేసిన అన్నా ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. పార్టీలో మాత్రం ఎప్పుడు పొగ‌లు.. సెగ‌లు క‌క్కేవారు. త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయిందంటూ.. పెద్ద యాగీనే చేశారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకుని.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై గిద్ద‌లూరు నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా.. ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నారు.

అదేస‌మ‌యంలో కార్య‌కర్త‌ల‌ను కూడా క‌లుపుకొని పోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ్రూపులు ఏర్ప‌డ్డాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండలాల్లోనూ.. అన్నాకు వ్య‌తిరేకంగా గ్రూపులు ఏర్ప‌డ్డాయంటే.. ఎంత వ్య‌తిరేక‌త ఉందో అర్ధ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే వారు అన్నాకు వ్య‌తిరేకంగా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి ఫిర్య‌దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఒక వేళ వీరి ఫిర్యాదుల‌కు క‌నుక అధిష్టానం స్పందించి.. చ‌ర్య‌లు తీసుకోని ప‌క్షంలో వారంతా మూకుమ్మ‌డిగా పార్టీకి రిజైన్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు గిద్ద‌లూరులో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు... వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అన్నాకు టికెట్ ఇవ్వొద్ద‌ని వారు డిమాండ్ చేస్తుండ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వీరంతా కూడా.. రెడ్డి వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం. ఇప్ప‌టి వారంతా.. త‌మ ప‌నుల కోసం మాజీ మంత్రి బాలినేని, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిల‌ను క‌లుస్తున్నారు.

అంటే మొత్తంగా ఎమ్మెల్యేను వారు ప‌క్క‌న పెట్టేశారు. ఇదిలావుంటే.. ఈ ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న టీడీపీ.. వైసీపీ నుంచిఎవ‌రు వ‌చ్చినా.. పార్టీలో చేర్చుకునేందుకు గేట్లు తెరిచి ఉంచింది. మ‌రోవైపు త‌న త‌ర్వాత‌.. అంత భారీ మెజారిటీ ద‌క్కించుకున్న అన్నా రాంబాబుకు నిజంగానే జ‌గ‌న్ డ‌టికెట్ ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెడతారా? అనేది చ‌ర్చ‌కు దారిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.