Begin typing your search above and press return to search.
జగన్ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గుంజుకోవడం అయ్యేపనేనా....?
By: Tupaki Desk | 14 Dec 2022 2:30 AM GMTజగన్ వైఎస్సార్ కి రాజకీయ వారసుడు కాడు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీసీసీ కొత్త చీఫ్ గిడుగు రుద్రరాజు. వైఎస్సార్ ఎనాడూ జగన్ని రాజకీయాల్లో తన వారసుడిగా ప్రకటించలేదు అని ఆయన ఫ్లాష్ బ్యాక్ కధలు చెబుతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వారు కూడా జగన్ వెంట నడవరాదని, పాత ఓటు బ్యాంక్ మళ్లీ వచ్చి కాంగ్రెస్ తో చేరాలని ఆయన భావన. అదే పిలుపుగా ఇస్తున్నారు.
కానీ అది అయ్యే పనేనా. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి దక్కడం రాజకీయాల్లో సాధ్యపడేనా. గిడుగు రుద్రరాజు కొత్త పూజారి కాబట్టి కొత్తగా పాత మాటలనే వల్లిస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికి పుష్కరం క్రితం ఉమ్మడి ఏపీలో అతి పెద్ద డిబేట్ గా అయి జనం మెదళ్లలో నానినవే. జగన్ వైఎస్సార్ ఆస్తికి మాత్రమే వారసుడు తప్ప ఆయన రాజకీయానికి కాదు, కాంగ్రెస్ వేరు వైఎస్సార్ ఫ్యామిలీ వేరు అని నెత్తీ నోరూ సీనియర్ నేతలు ఎందరో కొట్టుకున్నా జగన్ వెంట కాంగ్రెస్ నేతలు నడిచారు.
అలాగే ఏపీలో దశాబ్దాలుగా కాంగ్రెస్ ని కట్టుబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ డైరెక్ట్ గా జగన్ వైపు వెళ్ళిపోయింది. ఇపుడు దాని మీద పటిష్టమైన భవనాన్ని నిర్మించుకున్నారు జగన్. తాను సీఎం అయ్యాక కొత్త ఓటు బ్యాంక్ కి క్రియేట్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం నుంచి బీసీ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా టీడీపీతో పోరాడింది కానీ ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయలేకపోయింది. ఇపుడు జగన్ ఆ పని మీద ఉన్నారు.
ఇక చూస్తే ఏపీలో కాంగ్రెస్ అన్నది ఒక చరిత్రగా ఉంది. అది ఎత్తిగిల్లుతుందా అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి. కానీ దిగ్గజ నేత వైఎస్సార్ ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు అయితే తెలంగాణాలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే అదే తీరున ఏపీలో కూడా వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ వస్తే అపుడు ఏపీలో కూడా ఏమైనా ఉనికి ఉంటుందేమో చూడాలి. అయినా చంద్రబాబు ఏపీలో టీడీపీని అధికారంలో తెచ్చినా తెలంగాణాలో ఏమీ చేయలేకపోయారు.
రెండు రాష్ట్రాలు వేరుపడ్డాక రాజకీయం కూడా ఎక్కడిది అక్కడే అవుతోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ నాయకులు అత్యధిక భాగం జగన్ వైపు ఉన్నారు. మరికొంత మంది టీడీపీతో ఉన్నారు. బీజేపీలో ఉన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ఏపీలో అన్ని విధాలుగా చతికిలపడిపోయింది. ఆ పార్టీ జగన్ని ఎంత నిందించినా కూడా ఓటు బ్యాంక్ ఇటు వైపు షిఫ్ట్ అవుతుందన్న నమ్మకం అయితే ఈ దశలో లేదు. అయినా సరే ఆ పార్టీ నాయకులు మాత్రం చెబుతూ ఉంటారు. ఏపీలో అద్భుతాలు జరిగిపోతాయని.
ఇక్కడ ఒక మాట చెప్పాలి. కాంగ్రెస్ కి చేదుగా ఉన్నా కూడా అదే నిజం. ఉమ్మడి ఏపీలోనే కాంగ్రెస్ కి నిండైన బలం ఉంది. అది రెండుగా చీలింది. ఎటూ కాకుండా కాంగ్రెస్ అయిపోయింది. చిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ రాజకీయాలకే అవకాశాలు ఎక్కువ. అయినా పాతతరం నాయకులు నమ్మరు. తమ స్టేట్మెంట్స్ ఆపరు. కానీ విభజన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏటికి ఎదురీతగానే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.