Begin typing your search above and press return to search.

సింధూ కోసం కాసులు, బహుమతులు!

By:  Tupaki Desk   |   20 Aug 2016 7:07 AM GMT
సింధూ కోసం కాసులు, బహుమతులు!
X
నూట ఇరవై ఐదు కోట్ల హృదయాల్ని ఉప్పొంగేలా చేసి - 120 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో దేశానికి తొలి బ్యాడ్మింటన్‌ రజతాన్ని అందించి - ఆడుతున్న తొలి ఒలింపిక్స్ లోనే పతకం సాధించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ పీవీ సింధూపై ఒక పక్క ప్రశంసల జల్లులు కురుస్తుంటే... మరోపక్క కాసుల వర్షాలు - ఆఫర్ల వెల్లువలూ కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా మిగిలిన రాస్ట్రాల నుంచి కూడా సింధూ కు బహుమతుల ప్రకటనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో సొంత రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే సింధూ కు కోటి రూపాయలు ప్రకటిస్తే... తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు అంతకుమించిన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్ లో రజతం సాధించినందుకు గాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటించింది. ఇదే క్రమంలో సింధూ అందుకోబొతున్న రివార్డులను ఒకసారి పరిశీలిస్తే...

భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా సింధూకు రూ.50 లక్షలు - కోచ్ గోపీచంద్‌ కు రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సింధుకు రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది.

మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ సింధూకు తమ ఎస్.యూ.వీ. వాహనాన్ని బహుమతిగా ఇవ్వనుంది.

హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ ఏకంగా బీఎండబ్లూ కారును బహుమతిగా ఇవ్వనున్నారని తెలుస్తుంది.

ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ తావంతుగా రూ. 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.

ఇదే క్రమంలో అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకునేందుకు వెంటపడుతున్నాయి. అయితే ఇప్పటికే విజయవాడకు చెందిన ఒక జ్యూయలరీ షోరూం సింధూను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకునేందుకు ముందుకు వచ్చింది.