Begin typing your search above and press return to search.

గిల్ ఔట్.. రుతురాజ్ ఓపెనర్? పాండ్యాకు కఠిన పరీక్ష

By:  Tupaki Desk   |   7 Jan 2023 10:32 AM GMT
గిల్ ఔట్.. రుతురాజ్ ఓపెనర్? పాండ్యాకు కఠిన పరీక్ష
X
శ్రీలంకే కదా అనుకుంటే తొలి టి20లో ఓడించినంత పనిచేసింది.. రెండో టి20లో ఓడించేసింది.. ఇక మిగిలింది.. ఆఖరిది మూడో టి20. ఇందులో గెలుపే యువ కెప్టెన్ హార్డిక్ పాండ్యా సారథ్యానికి కొలమానం. రెండేళ్లలో జరగబోయే టి20 ప్రపంచ కప్ నకు అతడే కెప్టెన్ గా భావిస్తున్న పరిస్థితుల్లో తొలి పరీక్షను పాండ్యా ఎలా గట్టెక్కుతాడో చూడాలి.

ముంబైలో జరిగిన మొదటి టి20లో కలిసొచ్చిన అదృష్టం.. చివరి బంతి దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ అది కూడా 2 పరుగుల తేడాతో గెలిచింది. కానీ, రెండో టి20లో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. 16 పరుగుల తేడాతో ఓడింది.

సూర్యకుమార్, ఆల్ రౌండర్ అక్షర్ పోరాడకుంటే ఆ మాత్రమైనా స్కోరు వచ్చేది కాదు. కీలకమైన సమయంలో భారీగా పరుగులు ఇవ్వడమే కాకుండా.. ఛేజింగ్, బ్యాటింగ్‌లో ఒకదానివెనుక ఒకటి వికెట్లను కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పాండ్యపై ఉంది. అన్నిటికి మించి స్వదేశంలో తొలి సిరీస్‌ నెగ్గాలన్న పాండ్యకు ఇదొక పరీక్ష.ఓపెనింగ్ మార్పు తథ్యం కెప్టెన్ గా పాండ్యా తన ముద్రను చాటడంలో ఈ సిరీస్ మంచి అవకాశం.

అయితే,అతడు తొలి రెండు టి20ల్లో ఓపెనింగ్ మీద చూపు నిలపలేదు. ముస్తాక్ అలీలో 7 బంతుల్లో 7 సిక్స్ లు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్ ను కాదని, టి20ల్లో 125 స్ట్రయిక్ రేట్ కూడా లేని శుబ్ మన్ గిల్ ను ఎంచుకున్నాడు. అక్కడే పాండ్యా ముద్ర చూపలేకపోయాడు. రెండో టీ20లో గిల్, కిషన్, పాండ్య కలిపి చేసిన పరుగులు 24 (25 బంతుల్లో).. శ్రీలంక ఓపెనర్‌ నిస్సాంక (33: 35 బంతుల్లో) కంటే తక్కువ కావడం గమనార్హం. భారీ లక్ష్యం ముందున్న సమయంలో చెత్త షాట్లు ఆడి మరీ వికెట్లను సమర్పించారు. అప్పటికే టపటపా వికెట్లను కోల్పోయిన టీమ్ఇండియాను బాధ్యతగా ఆదుకోవాల్సిన హార్దిక్‌ కూడా విఫలం కావడం మరింత బాధించింది. గిల్, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే స్థానం నిలుపుకోవడం కష్టమే. ఇక 'మిషన్ - 2024' టి20 ప్రపంచకప్ సన్నద్ధతకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.

అర్ష్‌దీప్‌ కు మరొక అవకాశం సరైన ప్రాక్టీస్‌ లేకుండా నేరుగా రెండో టి20 మ్యాచ్‌ ఆడిన అర్ష్‌దీప్‌ 5 నో బాల్స్ వేశాడు. అయితే, అతడికి మరో ఛాన్స్‌ ఇవ్వాలనే డిమాండ్లూ ఉన్నాయి. ఈ ఒక్క మ్యాచ్‌ మినహా మిగతా వాటిల్లో అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొనడమే దీనికి కారణం. పేస్ ఉన్నప్పటికీ శివమ్ మావి, ఉమ్రాన్‌ మాలిక్ భారీగా పరుగులు ఇస్తున్నారు. స్పిన్నర్లు చాహల్, అక్షర్ రెండో టి20లో మంచి ప్రదర్శనే ఇచ్చారు. కాగా, ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ లైనప్‌ ఉన్న శ్రీలంకను అడ్డుకోవడానికి మరింత శ్రమించాలి.

లేకపోతే గత మ్యాచ్‌లో మాదిరిగా చివర్లో వచ్చిన ఆ జట్టు కెప్టెన్ శనక వీరబాదుడుకు బలికావాల్సి వస్తుంది.టాస్ ఎవరిని వరించేనో? సౌరాష్ట్రలోని రాజ్‌ కోట్ పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలం. కాబట్టి టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. కాగా, లంక రెండో టి20లో విజయంతో ఊపు మీదుంది. సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదల కనబరుస్తోంది. వారి జట్టులోనూ పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. అయితే భారత్‌ మాత్రం గిల్ లేదా రాహుల్‌ త్రిపాఠి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.