Begin typing your search above and press return to search.

మైగ్రేన్ తలనొప్పిని ఇది తగ్గిస్తుంది..

By:  Tupaki Desk   |   26 July 2019 5:29 AM GMT
మైగ్రేన్ తలనొప్పిని ఇది తగ్గిస్తుంది..
X
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి కాదు.. అల్లం కూడా ఎన్నో సద్గుణాల పదార్థమే. ఈ విషయం ఎన్నో పరిశోధనల్లో తేలింది. అల్లంతో కలిపిన పదార్థాలు తింటే ఎన్నో రోగాలు నయం అవుతాయని పరిశోధనల్లో తేలింది.

ప్రస్తుత సమాజంలో ఉద్యోగాలు- పని ఒత్తిడి అధికంగా ఉంది. దీనివల్ల తలనొప్పులు- మైగ్రేన్స్ వచ్చిపడుతున్నాయి. ఈ మైగ్రేన్స్ కు అద్భుతమైన ఔషధంగా అల్లం పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

అల్లం పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. కఫం- దగ్గుకు అల్లం తేనె కలిపి తీసుకుంటే బాగా ఉపశమనం కలుగుతుంది. నీరసంగా అనిపించినా అల్లం టీ తాగితే అలసట తీరుతుంది. ఇక అల్లం శొంటిని పొడి చేసి పంచదార కలుపుకొని పరగడుపున తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇక మనిషి ప్రాణాలు తీసే బ్లడ్ క్యాన్సర్ ను నిరోధించడంలో అల్లం బాగా పనిచేస్తుందని తేలింది. అల్లం టీ తాగితే అజీర్తిని దూరం చేసుకోవడంతోపాటు జీర్ణక్రియ క్రమబద్దీకరిస్తుందట.. అల్లాన్ని నిమ్మరసంలో నానబెట్టి పిల్లలకు నెలలో రెండుసార్లు ఇస్తే ఊదర రుగ్మతలు తొలిగిపోతాయి. గండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇక శరీర బరువును కూడా అల్లం తగ్గిస్తుంది.