Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులంతా ఔట్ డేటెడ్ బ్యాచ్ యేనా?

By:  Tupaki Desk   |   15 Jan 2023 7:30 AM GMT
బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులంతా ఔట్ డేటెడ్ బ్యాచ్ యేనా?
X
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తరించాలనుకుంటున్న నిర్ణయం మంచిదే అయినా కూడా ఎవరు వస్తే వారికే పగ్గాలు అప్పజెప్పడం.. కనీసం వారికి ప్రజల ఫెయిత్ ఉందా? ఓట్లు సంపాదించగలరా? అని ఆలోచించడం లేదు. ప్రజలు తిరస్కరించిన ఔట్ డేటెడ్ నాయకులకు పగ్గాలు అప్పగించి దేశమంతా బీఆర్ఎస్ విస్తరించాలని చూస్తున్నారు. ఏపీలో ఎవరూ దొరకనట్టుగా పోటీచేసిన ప్రతీసారి ఓడిపోయిన.. ప్రధాన పార్టీలు మారినా గెలవని తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కట్టబెట్టారు.అంతకుమించిన బలమైన నేతలను ఆకర్షించలేకపోయారు.

తాజాగా ఒడిశాలోనూ అదే కథ. వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చిన గిరిధర్ గమాంగ్ అనే సీనియర్ నేతకు ఒడిషా బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. ఒడిషా సంప్రదాయ కళాకారుడిగా జీవిస్తున్నారు. వయసు 80 దాటింది. ఈ వయసులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఏం చేస్తాడన్న ప్రశ్న వినిపిస్తోంది.

గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. నాడు వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన అనైతికంగా ఓటేశారు. చివరకు ఒక్క ఓటు తేడాతోనే వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఈ కారణంగా ఎన్నికలు వచ్చాయి. అప్పటి నుంచి మరోసారి ఈయన ఎన్నికల్లో గెలవలేదు.

కాంగ్రెస్ కు దూరమై బీజేపీలో చేరారు. అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇప్పుడు రాజకీయ చివరాంకంలో కేసీఆర్ ను ఆశ్రయించాడు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిషా చీఫ్ గా ఆఫర్ వచ్చింది. గిరిధర్ వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి లాభం లేదు. అయినా కూడా ఈయనకు విస్తరించాలి కాబట్టి కేసీఆర్ పదవి ఇచ్చారు. ఇలా ఔట్ డేటెడ్ నేతలందరినీ తీసుకొని పదవులు ఇస్తూ కేసీఆర్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళుతాడన్నది ప్రశ్న.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.