Begin typing your search above and press return to search.
గిరీష్ కర్నాడ్ ను చంపేస్తానన్న తోటి నటుడు
By: Tupaki Desk | 16 Nov 2015 11:23 AM GMTప్రముఖ నటుడు - రచయిత - జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను చంపేస్తానని తోటి నటుడే బెదిరించాడు. కన్నడ నటుడు - దర్శకుడు అయిన హుచ్చా వెంకట్ గిరీష్ ను తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించనని ఆయన హెచ్చరించాడు. హిందువులకు విరోధి అయిన టిప్పు సుల్తాన్ కు మద్దతుగా మాట్లాడితే ప్రాణాలతో మిగలవు... జాగ్రత్త అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చాడు.
కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న హుచ్చా వెంకట్ అదే షోలో పాల్గొన్న గాయకుడు రవి మరూర్ పై దాడి చేసి అప్పట్లో ఆ షో నుంచి బయటకొచ్చేశాడు. ఆ వివాదం ఇంకా ముగియకముందే హుచ్చా వెంకట్ గిరీష్ కర్నాడ్ ను చంపేస్తానని హెచ్చరించాడు. నువ్వు ఏమనుకుంటున్నావ్ హిందువుల విరోధి అయిన టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుతావా, కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని సూచిస్తావా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
ఇప్పుడు తాను బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చానని, నీ అంతు చూస్తానని గిరీష్ కర్నాడ్ ను హెచ్చరించాడు. టిప్పు సుల్తాన్ చరిత్ర గురించి తెలుసుకుని తరువాత మాట్లాడాలని గిరీష్ కర్నాడ్ కు సూచించాడు. వెయ్యి మంది వెళ్లి గిరీష్ కర్నాడ్ ను చంపేస్తే అందరినీ జైలులో పెడుతారా అని హుచ్చా వెంకట్ మీడియాను ప్రశ్నించారు. అయితే గిరీష్ కర్నాడ్ ఇప్పటి వరకు ఈ విషయంపై ఫిర్యాదు చెయ్యలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇంతకీ హుచ్చా వెంకట్ పేరులో ఉన్న హుచ్చా అన్నది ఆయన ఇంటిపేరు కాదట.. ఆయన తీరు వల్ల ఆయనకు వచ్చిన పేరట అది. హుచ్చా అంటే పిచ్చి అని అర్థం.