Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు కొత్త సమస్య తెచ్చిన యువతి
By: Tupaki Desk | 27 July 2019 5:23 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు.. గడిచిన హయాంలో కీలక శాఖల మంత్రి.. ఇప్పుడు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అంతేకాదు.. కేటీఆర్ ట్విట్టర్ లో యమ యాక్టివ్ పొలిటీషియన్. తనకు ట్విట్టర్ లో సమస్య అని చెప్పుకున్న వారందరి బాధలు తీరుస్తున్న కేటీఆర్ కు తాజాగా కొత్త సమస్య ఒకటి వచ్చిపడింది. అన్నార్థులకు - అసహాయులకు సాయం చేస్తున్న కేటీఆర్ కు ఈ ప్రేమ సమస్య నిజంగానే కొత్త.
తాజాగా కేటీఆర్ వద్దకు ఓ అమ్మాయి వచ్చింది. కేటీఆర్ పార్టీ కార్యాలయంలో ఉండగా ఆఫీసుకు వచ్చి బోరుమని ఏడ్వసాగింది. తన లవర్ తో పెళ్లి చేయాలని వేడుకుంది. అది చూసిన టీఆర్ ఎస్ నేతలు అవాక్కయ్యారు. ప్రియుడు మోసం చేశాడని.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆ ప్రియురాలు టీఆర్ ఎస్ ఆఫీస్ ఎదుట గుక్కపట్టి ఏడ్చింది.
వనపర్తి జిల్లా వెల్లటూరు కు చెందిన యువతి.. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే ప్రేమ తరువాత పెళ్లియే కదా.. కానీ ప్రియుడు హ్యాండిచ్చాడు. చేసుకోను అన్నాడు. దీంతో యువతి హైదరాబాద్ కుషాయిగూడలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిని పిలిపించగా.. 20రోజుల్లో చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. 20 రోజులు గడిచాయి.. సంవత్సరం అయ్యింది యువకుడు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు..
దీంతో విసిగి వేసారిన సదురు యువతి అందరి సమస్యలు తీరుస్తున్న కేటీఆర్ తన ప్రేమ - పెళ్లి సమస్యను కూడా తీర్చాలని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు వచ్చింది. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సమస్యను టీఆర్ ఎస్ మహిళా విభాగానికి అప్పగించిన పార్టీ నేతలు.. ఆమెకు న్యాయం చేస్తానని ఓదార్చారు.