Begin typing your search above and press return to search.

నీట్‌ లో అధికారుల పొరపాట్లు - విద్యార్థిని ఆత్మహత్య !

By:  Tupaki Desk   |   23 Oct 2020 1:30 PM GMT
నీట్‌ లో అధికారుల పొరపాట్లు - విద్యార్థిని ఆత్మహత్య !
X
దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలపై రోజురోజుకి దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎక్కువ అవుతున్నాయి. అధికారులు చేసిన తప్పుల వల్ల అమాయకమైన కొందరు విద్యార్థుల జీవితాలు అన్యాయంగా మొగ్గలోనే ఎండిపోతున్నాయి. అయితే , అధికారులు మాత్రం నీట్‌ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు దొర్లలేదని చెప్తున్నారు. అయితే , నీట్ ఫలితాల్లో ఒక్కొక్కటిగా తప్పిదాలు బయటపడుతూనే ఉన్నాయి. నీట్ లో అత్యున్నత మార్కులు సాధించిన వారికి సున్నా మార్కులు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ తరహా ఘటనే ఓ డాక్టర్‌ కావాలనుకున్న ఓ అమ్మాయికి నీట్‌ ఫలితాలు మధ్యలో ముగిసిపోయేలా చేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మధ్యప్రదేశ్ ‌కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయి నీట్‌లో మంచి మార్కులు వస్తాయని ఊహిస్తే ఫలితాల్లో కేవలం 6 మార్కులే రావడంతో షాక్ ‌కు గురైంది. డాక్టర్ కావాలని ఎన్నో కళలు కన్నది , కానీ, నీట్ లో ఆరు మార్కులే రావడంతో ఏమీ చేయాలో దిక్కుతోచని స్థితిలో న గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. తమ కూతురుకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని పేరంట్స్‌ కూడా అనుకోలేదు. తమ కూతురుకు మంచి మార్కులు వస్తాయనే గట్టి నమ్మకం వారిది. అందుకే ఓఎమ్‌ ఆర్‌ షీటును తెప్పించి చూశారు. అందులో విధి సూర్యవంశీకి 720 మార్కులకు గాను 590 మార్కలు వచ్చాయి. దీనితో అధికారులు చేసిన తప్పిదం వల్ల తమ కూతురు అన్యాయంగా బలైపోయింది అని ఆ తల్లిదండ్రులు ఆవేదనచెందుతున్నారు. కాగా.. నీట్‌ 2020 ఫలితాలను అక్టోబర్‌ 16న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయెబ్‌ అఫ్తాబ్‌, ఢిల్లీకి చెందిన ఆకాంక్షసింగ్ టాపర్లు గానిలిచారు .