Begin typing your search above and press return to search.
దారుణం: పరీక్ష రాస్తూ ప్రసవించిన విద్యార్థిని..
By: Tupaki Desk | 27 March 2020 4:00 PM GMTవిద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఓ వృద్ధుడు బాలికను లొంగదీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్నాళ్లుగా విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా కడుపు తీయించేందుకు యత్నించాడు. అయితే అనూహ్యంగా ఆమె ప్రసవించింది. ఈ సంఘటన లాక్ డౌన్ కు ఒకరోజు ముందు జరిగినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని నమక్కళ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని స్థానిక పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి ఐదేళ్ల కిందటే మృతచెందగా తల్లీ కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తుంది. వీరి ఇంటి పక్కనే ఉండే 70 ఏళ్ల వృద్ధుడు విద్యార్థినికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
8 నెలల గర్భవతి అయిన సదరు బాలిక లాక్డౌన్ ముందు రోజు పరీక్షలకు హాజరైంది. సడన్ గా నొప్పులు రావడంతో ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని బాత్రూం వెళ్లింది. బాలిక ఎంతకు తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన టీచర్ బాత్రూంకు వెళ్లి చూడగా రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే అప్రమత్తమైన టీచర్ అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. తల్లిబిడ్డలకు ప్రాణపాయం తప్పినట్లు సమాచారం.
సదరు బాలికను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆ వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వృద్ధుడు నేరాన్ని అంగీకరించడం తో పోక్సో తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న స్థానికులు వృద్ధుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వృద్ధుడికి కఠిన శిక్షలుపడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్థానికులు వెనుదిరిగారు.