Begin typing your search above and press return to search.
మాటలు రాని విధంగా సూరత్ దారుణం
By: Tupaki Desk | 16 April 2018 6:06 AM GMTఒక్కొక్కటిగా బయటకు వస్తున్న దారుణాల్ని చూస్తుంటే వణుకు పుట్టటం ఖాయం. మా పిల్లలకు భద్రత లేదా? అన్న సందేహంతో పాటు.. ఇలాంటివెన్ని దారుణాలు ఇంకా చూడాల్సి ఉంటుంది దేవుడా? అన్న ప్రశ్న వేయాలనిపించక మానదు. ఎనిమిదేళ్ల బాలికను నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి..దారుణంగా హింసించి చంపేసిన ఉదంతం యావత్ భారతాన్ని కదిలిస్తున్న సంగతి తెలిసిందే. మనసు చేదుగా మార్చేయటమే కాదు. ఇంత దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే ఉరి తీయాలన్న ప్రజాగ్రహాం ప్రభంజనంలా వెల్లువెత్తుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో దారుణం బయటకు వచ్చింది. మహారాష్ట్రలోని సూరత్ లో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు.సుమారు 9 నుంచి 11 ఏళ్ల వయసున్న బాలికగా భావిస్తున్నారు. ఈ బాలిక మృతదేహాన్ని భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం వద్ద ఈ నెల ఆరున గుర్తించారు. ఈ మృతదేహానికి జరిపిన పోస్ట్ మార్టంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
ఆ చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. హింసించనట్లుగా పోస్టుమార్టంలో గుర్తించారు. ఆ బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. పూర్తి నివేదిక కోసం ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించినట్లుగా సూరత్ సివిల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలిక బంధువులు ఇప్పటివరకూ రాలేదని చెబుతున్నారు. ఈ 11 ఏళ్ల బాలిక ఎవరు? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.