Begin typing your search above and press return to search.
హర్యానా అబ్బాయితో కాలిఫోర్నియా అమ్మాయి ఫేస్ బుక్ పెళ్లి
By: Tupaki Desk | 9 Oct 2019 7:00 AM GMTడిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చటమే కాదు.. ఊహకు అందని రీతిలో కొంత మంచిని.. మరికొంత చెడును తీసుకొచ్చింది. మంచి కంటే చెడు గురించే ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది. దీంతో.. మంచి అన్నది లేదా? అన్న సందేహం కలిగే పరిస్థితి. ఫేస్ బుక్ తో పరిచయాలతో అత్యాచారాలు.. హత్యలు.. ఇలా క్రైం గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం.
ఇప్పుడు చెప్పే విషయం అలాంటిది కాదు. కాస్తంత సినిమాటిక్ ఉండటమే కాదు.. హ్యాపీ ఎండింగ్ దీని ప్రత్యేకత. ఫేస్ బుక్ పుణ్యమా అని హర్యానా అబ్బాయికి.. అక్కడెక్కడో కాలిఫోర్నియాలో ఉండే అమ్మాయికి మద్య ప్రేమ చిగురించటమే కాదు.. వారి మధ్య బంధం పెళ్లితో మరింత బలపడింది. తాజాగా జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఏడాదిన్నర క్రితం కాలిఫోర్నియాకు చెందిన సెలీనాకు హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన సుశీల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అందుకు ఆమె ఓకే చెప్పింది. అలా మొదలైన వారి స్నేహం అంతకంతకూ పెరిగి పెద్దదైంది. వారి స్నేహం ప్రేమగా మారింది. చివరకు వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సెలీనా ఇంట్లోని వారే కాదు.. సుశీల్ కుటుంబీకులు కూడా ఓకే చెప్పేశారు.
తాజాగా వారిద్దరి వివాహం కర్నాల్‌లోని శ్రీకృష్ణ మందిరంలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా పెళ్లి జరిగింది. కాలిఫోర్నియా నుంచి వచ్చిన సెలీనా మీడియాతో మాట్లాడుతూ.. తనకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని.. అమెరికాలో వివాహాలకు ఇక్కడ భిన్నంగా ఉంటాయని చెప్పింది.
భారతదేశంలోని వారు ఎంతో ప్రేమను కురిపిస్తారని చెప్పిన ఆమె.. తమ కుటుంబ సభ్యులు ఇక్కడకు వచ్చినప్పుడు.. వారిని ఘనంగా స్వాగతం పలికిన తీరుకు తన తండ్రి ఎంతో సంతోషానికి గురయ్యారని ఆమె చెప్పింది.
ఇదిలా ఉంటే.. సుశీల్ తండ్రి సైతం తమ అబ్బాయి ప్రేమను తాము స్వాగతించామని.. లవ్ మ్యారేజ్ చేసుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఫేస్ బుక్ లో స్నేహాలు దారుణాలకే కాదు.. చాలా సందర్భాల్లో సంతోషాలకు సైతం కారణమవుతుంటాయి. కాకుంటే.. మనం ఎంపిక చేసుకునే వ్యక్తుల మీదనే విషయమంతా ఆధారపడి ఉంటుందన్నది మర్చిపోకూడదు.