Begin typing your search above and press return to search.
లైఫ్ కి ఇలాంటి ప్రెండ్ ఒక్కరుంటే చాలు
By: Tupaki Desk | 21 Jun 2016 4:14 PM GMTఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరుంటే చాలనుకుంటారు చాలామంది. కానీ.. ఇప్పుడు మేం చెప్పబోయు ఫ్రెండ్ ఒక్కరు జీవితంలో ఉంటే అంతకు మించిన ఎలాంటి అవసరం ఉండదు. స్నేహానికి సరికొత్త అడ్రస్ గా మారిన ఈ ఉదంతం గురించి తెలుసుకోవాల్సిందే. ఈ కథనం చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అని ఆలోచించకుండా.. అలా మీ స్నేహితుల పట్ల మీరు ఉండగలరా? అన్న ప్రశ్న వేసుకోండి. దాని కంటే ముందు.. మీరీ కథనాన్ని చదవాలి.
తమిళనాడులోని త్రిచిలోని సమయపురానికి చెందిన వర్షిణి.. జనని ఇద్దరూ ఎల్ కేజీ నుంచి స్నేహితరాళ్లు. బాల్యం నుంచే ఇద్దరూ డాక్టర్లు కావాలని కలలు కనే వారు. అందుకు తగ్గట్లే వారిద్దరూ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాశారు. ఇద్దరికి మెడికల్.. డెంటల్ కౌన్సెలింగ్ కు పిలుపు వచ్చింది. ఇద్దరూ కౌన్సెలింగ్ సెంటర్ కు వచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. జనని కంటే వర్షిణికి కాస్త మెరుగైన ర్యాంకు రావటంతో ఆమెను ముందు పిలిచారు. ఆమె వెనుకనే జనని ఉంది. ఇంతా చేస్తే.. రాష్ట్రంలో అత్యున్న మెడికల్ కాలేజీ అయిన మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక్క సీటు మాత్రమే ఉంది. ఈ ఇద్దరి స్నేహితురాళ్ల మధ్య మార్కుల తేడా కేవలం 0.25 మాత్రమే. బీసీ కోటాలో వర్షిణికి సీటు కేటాయించటంతో జనని నిరాశ పడింది. అదే సమయంలో తాను సీటు తీసుకుంటే తన స్నేహితురాలికి సీటు మిస్ అవుతుందని అర్థం చేసుకున్న వర్షిణి కాలేజీ సీటును వదులుకుంది. దీంతో.. ఆమె వెనుకనే ఉన్న జననికి సీటు లభించింది.
కేవలం స్నేహం కోసం.. స్నేహితురాలి కోసం టాప్ మెడికల్ లో వచ్చిన సీటును వదులుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎవరికి వారు తమ తమ స్వార్థ్యం కోసం తల్లిదండ్రులను సైతం ఏదేదో చేస్తున్న వేళ.. స్నేహం కోసం వర్షిణి చేసిన త్యాగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ అంత త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు వర్షిణి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? తనకు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లల కోటాతో పాటు.. బీసీ కేటగిరిలోనూ రిజర్వేషన్ ఉంది కాబట్టి.. జనరల్ కౌన్సెలింగ్ అయినా సీటు వస్తుందని.. కానీ తన స్నేహితురాలికి అలాంటి అవకాశం ఉండదని చెప్పింది. ఎంత సీటు వచ్చినా.. మద్రాస్ మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలో సీటు దొరకటం మాత్రం ఉండదు. అయినప్పటికీ తన గురించి ఆలోచించకుండా.. తన స్నేహితురాలు గురించి ఆలోచించిన వర్షిణి గ్రేట్ కదూ..?