Begin typing your search above and press return to search.
ఫత్వాకు షాకిచ్చేలా ఓపెన్ హగ్గులతో భారీ షాక్!
By: Tupaki Desk | 20 Jun 2018 5:01 AM GMTముస్లిం మత పెద్దల పేరుతో కొందరు జారీ చేసే తలా తోక లేని ఫత్వాలు పలువురికి ఒళ్లు మండేలా చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఫత్వాను జారీ చేసిన ఒక యూపీ మత పెద్ద తీరుకు అదే రాష్ట్రానికి చెందిన ఒక అపరిచిత అమ్మాయి ఇచ్చిన షాక్ అలా ఇలా లేదు.
మహిళల స్వేచ్ఛకు చెక్ పెట్టేలా జారీ చేసిన ఫత్వాకు నిరసనగా యూపీలోని మొరాదాబాద్ నగరంలో ఒక షాపింగ్ మాల్ ఎదుట ఒక అమ్మాయి చేపట్టిన కార్యక్రమం స్థానికంగానే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఫత్వాకు దిమ్మ తిరిగేలా షాకిస్తూ.. రంజాన్ సందర్భంగా మాల్ ఎదుట.. అందరూ చూస్తుండగా.. యువకులందరిని హగ్ చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన వైనం సంచనలంగా మారింది.
ఆమెను హగ్ చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు ముస్లిం యువకులు భారీ ఎత్తున బారులు తీరారు. దాదాపు గంట పాటు సాగిన ఈ శుభాకాంక్షల హగ్గుల పర్వం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక ముస్లిం మహిళ ఇంత ఓపెన్ గా.. ఎలాంటి భయం లేకుండా ఫత్వాకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
ఒక ముస్లిం అమ్మాయి ఎలాంటి భయం లేకుండా షాపింగ్ మాల్ ఎదుట రోడ్డు మీద నిలబడి నవ్వుతూ అపరిచిత యువకులను హగ్ చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు చెప్పటం తనకు ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా ఆసిఫ్ అనే యువకుడు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఒక యువతి యువకుల్ని హగ్ చేసుకోవటం.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దమని మండిపడుతున్నారు. అయితే.. తల తోకా లేని ఫత్వాలకు వ్యతిరేకంగానే తన పోరాటమంటూ సదరు యువతి చెబుతోంది. ప్రస్తుతం హగ్గుల వీడియో నెట్టింట హడావుడి చేస్తోంది.