Begin typing your search above and press return to search.
కిడ్నాప్ చేశారంటూ రీల్ కథ చెప్పిన రియల్ యువతి
By: Tupaki Desk | 15 Aug 2019 4:56 AM GMTసినిమాలు ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పే ఉదంతమిది. ఇటీవల విడుదలైన విజయవంతమైన సినిమాగా పేర్కొందిన రాక్షసుడు సినిమాను చూసిన స్ఫూర్తి పొందిన ఒక యువతి చేసిన హడావుడితో హైదరాబాద్ పోలీసులకు చెమటలు పట్టేలా చేసింది. తెగ హైరానా పడిన పోలీసులు ఉరుకులు పరుగుల తీసిన ఆ ఉదంతంలో జరిగిందేమంటే..
మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు.. లక్కీగా తప్పించుకుందంటూ గుంటూరు జిల్లాకు చెందిన తల్లిదండ్రులు హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు.. కిడ్నాప్ కు కారణమైన నిందితుల్ని పట్టుకునేందుు అపసోపాలు పడ్డారు. తమకిచ్చిన కంప్లైంట్ లోని వివరాల ఆధారంగా కిడ్నాప్ చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేశారు. అనుమానంతో క్రాస్ చెక్ చేసినంతనే షాకింగ్ నిజం బయటకు వచ్చి అవాక్కు అయ్యారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. పోలీసులు సైతం ఆగ్రహానికి గురి చేసేలా చేసింది.
ఎందుకంటే.. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం సదరు 18 ఏళ్ల యువతి కిడ్నాప్ కాలేదు. తాను కిడ్నాప్ అయినట్లుగా జస్ట్ నాటకం ఆడింది. సినిమాల ప్రభావంతో స్క్రిప్ట్ బాగానే రాసుకున్నా.. పోలీసులు అంతకు మించిన తెలివితో పరిశోధన చేస్తారన్న విషయం తెలీక.. అడ్డంగా బుక్ అయ్యింది. రీల్ కథను తలపించే రీతిలో సదరు యువతి చెప్పిన కథ ఎలా ఉందంటే.. ‘హాస్టల్ నుంచి స్టేషనరీ కొనేందుకు వెళుతున్నా. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అంబులెన్సులో మీ వారు ఉన్నారు. పిలుస్తున్నారని ఓ వ్యక్తి చెబితే వెళ్లా. అంబులెన్స్ లోని ఉన్న ఒక వ్యక్తి లోపలకు లాగేశాడు. మరొకరు ముఖం మీద ఏదో స్ప్రే చేశారు. స్పృహ కోల్పోయా. రాత్రికి మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూస్తే ఒక గదిలో ఉన్నట్లు అర్థమైంది. దగ్గరల్లో ఎవరూ లేకపోవటంతో గది నుంచి బయటకొచ్చా. రోడ్డుపైకి వచ్చి ఆటో ఆపా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లా. అక్కడి నుంచి లింగంపల్లిలోని బంధువుల ఇంటికి వెళదామని ఎంఎంటీఎస్ ఎక్కితే అది ఫలక్ నుమా వైపు వెళుతోంది. దీంతో కాచిగూడలో దిగేశా. అక్కడే రేపల్లెకు వెళ్లే రైలు ఎక్కి గుంటూరులో ఉన్న ఇంటికి వెళ్లా అంటూ చెప్పిన మాటలతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనతో హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక యువతి కిడ్నాప్ కావటం.. తప్పించుకోవటంతో అలెర్ట్ అయిన పోలీసులు.. నిందితుల్ని దొరకబుచ్చుకునేందుకు పరుగులు తీశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం విచారణ షురూ చేసిన పోలీసులకు ఒక పట్టాన మ్యాచ్ కాని పరిస్థితి. ఆమె చెబుతున్న వివరాలపై చిన్నపాటి సందేహం వచ్చిన వారు.. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా.. ఆమె తాపీగా నడుచుకుంటూ వెళ్లటాన్ని గుర్తించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తర్వాత రాజ్ భవన్ రోడ్డు గుండా బేగంపేట మెట్రో స్టేషన్ వరకూ నడుచుకుంటూ వెళుతున్నట్లు గుర్తించారు.
కిడ్నాప్ కథను అల్లినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ యువతి ఎవరితో మాట్లాడిందో తెలుసుకునే ప్రయత్నంలో.. తండ్రితోనే మాట్లాడినట్లు గుర్తించారు. ఇంతకీ కిడ్నాప్ నాటకం ఎందుకు ఆడుతుందన్న విషయాన్ని చేధించే క్రమంలో ఆ యువతిని తమదైన రీతిలో విచారించగా.. అసలు విషయం తెలిసి అవాక్కు అయ్యారు.
పంజాగుట్టలోని ఒక కాలేజీలో బీఎస్సీ చదువుతున్న సదరు యువతి.. చదువులో వెనుకబడటమే కాదు.. కాలేజీలో ఇమడలేకపోతోంది. దీంతో.. హైదరాబాద్ లో చదవటంపై ఆసక్తి లేని ఆమె.. తల్లిదండ్రులకు కిడ్నాప్ కథను అల్లటం ద్వారా భయపడి.. తనను ఊరికి తీసుకెళ్లిపోతారన్న ఉద్దేశంతో కిడ్నాప్ నాటకానికి తెర తీసినట్లు గుర్తించారు. అయితే.. ఇందులో మరింకేమైనా కొత్త కోణం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. రీల్ కథను రియల్ కథను నమ్మించటంలో సక్సెస్ అయిన యువతి.. పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. ఇలాంటి చేష్టల కారణంగా అసలైన బాధితులకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.