Begin typing your search above and press return to search.
ఫ్రెండ్షిప్ డే : పార్టీకి వెళ్లి ..అమ్మాయి దుర్మరణం, ఎలా జరిగిందంటే ?
By: Tupaki Desk | 3 Aug 2021 9:30 AM GMTహైదరాబాద్ నగరంలో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులు భయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వచ్చే వరకు నమ్మలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురౌతున్నారు. ఆ ప్రమాదాల్లో కొన్ని సందర్భాల్లో అమాయకులు కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం...తెల్లాపూర్ లోని బోన్సాయ్ అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్ 520లో నివాసం ఉండే డి.వినయ్ కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె డి.అశ్రిత కెనడాలో ఎం.టెక్ పూర్తి చేసింది. గత కొన్ని రోజుల ముందే ఇండియాకు వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో స్నేహితులైన తరుణి, సాయిప్రకాష్, అభిషేక్ లతో కలిసి ఆమె మాదాపూర్ లోని స్నార్ట్ పబ్ కు స్కోడా కారులో వెళ్లారు. అక్కడే మరికొంత మంది మిత్రులూ కలిశారు. రాత్రి 11 గంటల వరకు అక్కడే గడిపారు. అనంతరం స్కోడా కారులో అభిషేక్ డ్రైవింగ్ చేయగా, సాయిప్రకాశ్ ముందు సీట్లో, అశ్రిత, తరుణిలు వెనుక సీట్లో కూర్చున్నారు. వీరు పబ్ లో మద్యం సేవించారు.
ఈక్రమంలో వీరి కారు హఫీజ్ పేట్ ఆర్ వోబీ నుంచి మదీనాగూడకు వెళుతుండగా..రాత్రి 11.30 గంటల సమయంలో కొండాపూర్ లోని మై హోం మంగళ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రాళ్లను ఢీ కొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో వెనక డోర్ తెరుచుకుని.వెనక సీట్లో ఉన్న అశ్రిత కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనకాలే మరో కారులో వస్తున్న వీరి మిత్రులు చిన్మయ్, వివేక్‌లు ప్రమాదాన్ని చూసి క్షతగాత్రులను కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అశ్రిత మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. కాగా డిన్నర్‌లో అభిషేక్, సాయి ప్రకాష్, తరుణి, అశ్రితలు వోడ్కా సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే అభిషేక్ కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు వెల్లడించారు.
ఆదివారం బోనాలు కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు వైన్స్, బార్ లు, పబ్ లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కస్టమర్లకు మద్యం అందించారు. కాగా పబ్ పేరు స్నార్ట్ అని ఉన్నప్పటికీ రుచి ఇండియా రెస్టారెంట్ అండ్ బార్ పేరిట లైసెన్స్ తీసుకున్నారు. పి.మమత పేరున లిక్కర్ లైసెన్స్ ఉంది. పబ్ లోకి వెళ్లిన వారికి వోడ్కా అమ్మినట్లు ఆధారాలు సేకరించిన గచ్చిబౌలి పోలీసులు స్నార్ట్ పబ్ యజమాని, మేనేజర్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.