Begin typing your search above and press return to search.
ప్రేమ కోసం కన్నతల్లినే కడతేర్చిన కసాయి కూతురు
By: Tupaki Desk | 28 Oct 2019 7:43 AM GMTరోజురోజుకి ఈ ప్రపంచంలో మానవత్వం అనేదే లేకుండాపోతుంది. తల్లిని మించిన దైవం ఉందా అని అందరూ అంటారు..కానీ , కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రియుడి కోసం కన్నతల్లినే కాటికి పంపిన దుర్ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పెళ్ళికి ఎదిగొచ్చిన తన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనీ ఆ తల్లి కనని కల లేదు. కానీ , కుమార్తె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందనే విషయం తెలిసి షాక్ కి గురైంది.
నువ్వు చేస్తున్న పని చాలా తప్పు అంటూ రెండు - మూడు సార్లు మందలించింది. కానీ , అప్పటికే కామంతో కళ్ళుమూసుకుపోయిన ఆ కూతురు తన ప్రేమకి అడ్డుతగులుతుంది అని కన్నతల్లినే హతమార్చింది. ఈ దుర్ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని మునగనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. తన ప్రియుడితో కలిసి ఒక పథకం ప్రకారం కన్నతల్లి కడతేర్చిన తరువాత మూడు రోజులపాటు ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టింది. ఇక ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉంటే .. దుర్వాసన వస్తే పక్కనున్న వారికి అసలు విషయం తెలిసిపోతుంది ఐ భావించి ప్రియుడి సాయంతో తల్లి శవాన్ని నల్గొండ జిల్లా రామన్నపేట రైల్వే ట్రాక్ వద్ద పడేసి వచ్చి - తనకేమి తెలియనట్టు ఉంది. తండ్రి డ్రైవర్ కావడంతో బయట పనులకి వెళ్లి వస్తుంటారు. ఇంటికి వచ్చిన ఆయనకి తన భార్య కనిపించకపోవడం తో అమ్మ ఎక్కడ అంటూ తండ్రి గట్టిగా నిలదీయడంతో... తానే చంపినట్టు ఆమె ఒప్పుకుంది. దీంతో, పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు కీర్తీని.. అరెస్ట్ చేసి - జైలుకు తరలించారు. ఇద్దరి ప్రియుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.