Begin typing your search above and press return to search.
తనకు తానే పెళ్లి.. యువతికి అధికారుల షాక్
By: Tupaki Desk | 4 Jun 2022 10:31 AM GMTతనకు తానే స్వీయ వివాహం చేసుకుంటానని సంచలనం రేపిన గుజరాత్ యువతి క్షమాబిందుకు అధికారులు షాక్ ఇచ్చారు. గుజరాత్ లోని వడోదరలో జూన్ 11న ఓ దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమాబిందు నిర్ణయించుకుంది. అయితే ఈ స్వీయ వివాహానికి ఆలయ అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఆమె నిర్ణయం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కలుషితం చేస్తుందని, భారతీయ సమాజం ఇలాంటి వాటిని ఎప్పుడూ హర్షింబోదని ఆలయ పాలక మండలి తెలిపింది. ఇలాంటివాటికి ఒప్పుకుని తమ ఆలయం చెడుగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలని కోరుకోవడం లేదని వెల్లడించింది.
మరోవైపు వడోదరలోని గోత్రి ఆలయంలో తన పెళ్లి ఈ నెల 11న జరగనున్నట్లు ఆమె పెళ్లి కార్డు కూడా కొట్టించేసింది. అయితే ఆలయంలో వివాహానికి దేవస్థాన పాలక మండలి నిరాకరించింది. వింత పెళ్లికి, వంతపాడలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆమె ఎక్కడ పెళ్లి చేసుకుంటుందోనని నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది.
కాగా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 24 ఏళ్ల క్షమాబిందుకు పెళ్లిపై కోరిక లేదు. కానీ పెళ్లి కూతురులా ముస్తాబవ్వలని ఉందంట. అందుకే తనను తాను పెళ్లాడాలని నిర్ణయించుకుంది. దీన్ని సోలోగమీగా పిలుస్తారు. 2003లో పాపులర్ టీవీ సిరీస్ 'సెక్స్ అండ్ సిటీ'లో క్యారీ బ్రాడ్ షా అనే క్యారెక్టర్ ద్వారా ఈ కాన్సెప్ట్ పాపులర్ అయింది. 2017లో బ్రెజిల్ మోడల్ అడ్రియానా లిమా తనను తానే పెళ్లి చేసుకుంది.
కాగా భారత్ లో ఇలా తనను పెళ్లాడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. కాబట్టి క్షమాబిందు తనను తను పెళ్లాడాలనుకుని సంచలనం సృష్టించింది. ప్రేమ మీద తనకు నమ్మకముందని, ప్రేమలో పడితే పెళ్లి చేసుకుంటారని క్షమాబిందు చెబుతోంది. ఈ నేపథ్యంలో తనను తాను ప్రేమించుకుంటున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని క్షమాబిందు వివరించింది.
ఈ పెళ్లి కూడా ఒక ఒప్పందంలాంటిదేనని, నన్ను నేను అంగీకరించుకోవడం, నా ఆత్మలో నేను కలిసిపోవడం, ఎవరేమనుకున్నా అమ్మాయి మనసుకు ఏది నచ్చితే అది చేసే హక్కు ఉండాలని క్షమాబిందు చెబుతోంది. తన పెళ్లికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించింది.
ఇవన్నీ కాదు కానీ పెళ్లి తర్వాత హనీమూన్ కూడా వెళ్లనుందట ఈ పెళ్లికూతురు.. సోలోగా రెండు వారాలు గోవాకు వెళ్తున్నట్లు పేర్కొంది. అయితే ఇలాంటి వివాహం జరగడం గుజరాత్‌లోనే కాదు దేశంలోనే మొదటిసారి. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా క్షమాబిందుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగ దళ్, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ సంప్రదాయాలను కలుషితం చేయాలని చూస్తే తాము ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి.