Begin typing your search above and press return to search.
ఒంటరిగా.. వివాహ బంధంలోకి.. 'నన్నే పెళ్లాడతా'యువతి
By: Tupaki Desk | 9 Jun 2022 11:05 AM GMTఆమె విద్యాధికురాలు.. మానవ సంబంధాలకు చెందిన కోర్సు చదివింది. ఆమో పేరులోనే ఎవరినైనా క్షమించగల అర్థం ఉంది. కానీ, జంటగా వైవాహిక బంధంపై ఎందుకనో విరక్తి కలిగింది. తనను తానే పెళ్లాడుకుంటానని ప్రకటించింది. గత వారం సంచలనం రేపింది. ఇప్పుడు తాను అనుకున్నట్లే ''నన్నే పెళ్లాడతా''అంటూ మూడు ముళ్లు వేసుకుంది. ఆమే.. గుజరాత్ కు చెందిన క్షమా బిందు. తన స్వీయ వివాహానికి అడ్డకుంలు ఎదురవుతుండడంతో.. ముహూర్తానికి ముందే పెళ్లీ పీటలు.. కాదు కాదు పెళ్ల పీట ఎక్కేసింది.
పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి..
మన దేశంలో వివాహమంటే.. పందిళ్లు.. సందళ్లు.. తాళాలు తలంబ్రాలు.. మూడు ముళ్లు.. జంటగా ఏడు అడుగులు.. కానీ, ఇవేమీ లేకుండానే ఆ యువతి వివాహమాడేసింది. అదికూడా ఆత్మీయుల సమక్షంలో కావడం విశేష. అలా.. బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు 'స్వీయ వివాహం' చేసుకొంది. సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. వరుడు తప్ప. ముందుగానే అన్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24ఏళ్ల క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇందుకు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది.
సంప్రదాయవాదుల హెచ్చరికతో..
క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని గత వారం ప్రకంటించడం పెద్ద వివాదం రేపింది. వివాదాస్పదంగా మారింది. ఆమె తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఈ పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి క్షమా తన వివాహాన్ని ఈ నెల 11న జరుపుకోవాల్సింది. కానీ, బెదిరింపుల నేపథ్యంలో రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకొంది.
ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమా. హల్దీ, మెహందీ కార్యక్రమాలతో పాటు పెళ్లిలో వేద మంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. దేశంలోనే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) ఇదే.
ఎవరీ క్షమా బిందు?
గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. సోషియాలజీలో డిగ్రీ చదివింది. ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ అధికారిణిగా పనిచేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు సరేనన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియోకాల్ ద్వారా హాజరయ్యారు.