Begin typing your search above and press return to search.
మాటిచ్చి.. సాయం మధ్యలో ఆపితే ఎలా సారూ?
By: Tupaki Desk | 7 Jan 2020 6:12 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అంటే మాట. తల తెగిపడినా మాట ఇచ్చిన తర్వాత దేనికైనా రెఢీ అన్నట్లుగా ఉంటానని ఆయన తరచూ చెప్పుకుంటారు. మాట తప్పని.. మడమ తిప్పని నైజం తన సొంతంగా ఆయన మాటలు ఉంటాయి. అయితే.. మాటలకు చేతలకు మధ్య తేడా చాలా ఉందన్న మాట వినిపిస్తోంది. చిన్నతనం నుంచే డాక్టర్ కావాలన్న సంకల్పంతో ఉన్న ఒక పేదింటి చదువుల తల్లికి మాట ఇచ్చిన కేసీఆర్.. తానిచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో మధ్యలోనే మర్చిపోయారన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని గోల్ తండాకు చెందిన ఇందు పేదింటి చదువుల తల్లి. బాగా చదివే ఆ అమ్మాయి విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలన్నది సంకల్పం. అందులో భాగంగా ఇంట్లో వారి సాయంతో ఫిలిప్పీన్స్ కు వెళ్లింది. తీరా వెళ్లి.. కోర్సు చేరిన తర్వాత అక్కడ ఇస్తామన్న స్కాలర్ షిప్ ఇవ్వలేదు. దీంతో.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది.
దాదాపు రూ.50 లక్షలు అవసరమైన నేపథ్యంలో.. అంత మొత్తాన్ని సర్దుబాటు చేయలేని ఇందూ తండ్రి.. 2018 మేలో జరిగిన రైతు సమన్వయ సమితి సభలో సీఎం కేసీఆర్ కు తన ఆవేదనను చెప్పుకున్నారు. దీనికి చలించిన సీఎం కేసీఆర్.. వెంటనే వేదిక మీద నుంచే ఇందూ వైద్యవిద్యకు అవసరమైన ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పటమే కాదు.. డాక్టర్ ను చేస్తామని అభయమిచ్చారు.
సీఎం కేసీఆర్ మాటకు తగ్గట్లే అధికారులు తొలి విడతలో రూ.20 లక్షలు విడుదల చేసింది. రెండేళ్ల పాటు చదువు పూర్తి చేసిన ఆమె.. మిగిలిన మూడేళ్లకు అవసరమైన రూ.30లక్షల మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. దీంతో.. ఆమె కోర్సును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి. కుమార్తె చదువుకు అవసరమయ్యే మొత్తాన్ని తాను సర్దుబాటు చేయలేనని ఇందూ తండ్రి వాపోతున్నాడు.
తన కుమార్తె చదువు పూర్తి చేయటం కోసం.. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని.. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను కలిసినప్పటికీ నిధులు విడుదల కాలేదు. దీంతో.. ఇందు ఫ్యూచర్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడింది. మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గేది లేదనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు భిన్నంగా పరిస్థితులు ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇందూ మెడిసిన్ కోర్సును పూర్తి అయ్యేలా సాయం చేయాలని కోరుతున్నారు. మరి.. కేసీఆర్ కు ఈ వినతులు చేరతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.