Begin typing your search above and press return to search.
ఇకపై అమ్మాయికి కూడా 21 ఏళ్లు నిండాల్సిందే
By: Tupaki Desk | 16 Dec 2021 11:55 AM ISTభారత దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయసు 18 ఏళ్లు కాగా అబ్బాయిల పెళ్లికి కనీస వయసు 21 ఏళ్లు అనే విషయం తెల్సిందే. కాని మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వయసులో మార్పులు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కేంద్ర క్యాబినేట్ అమ్మాయిల కనీస పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అబ్బాయిల పెళ్లి వయసు మాత్రం అలాగే ఉంచుతున్నట్లుగా పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో యూనివర్శిటీల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అమ్మాయిలు సామాజిక కార్యకర్తలు మరియు పెద్దల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత అమ్మాయి కనీస పెళ్లి వయసు పెంచినట్లుగా టాస్క్ పోర్ట్ విభాగం అధికారులు చెప్పుకొచ్చారు.
ఇంతకు ముందు వరకు అమ్మాయిలు 18 ఏళ్లు నిండకుండా వివాహంకు సిద్దం అవ్వడం బాల్య వివాహం అవుతుంది. బాల్య వివాహంకు కఠిన చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. ఇకపై 21 ఏళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిలు చేయడం కూడా బాల్య వివాహం అవుతుందని కేంద్ర అధికార వర్గాల వారు ప్రకటించారు.
పల్లె మరియు పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితంగా అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లను పాటించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టాస్క్ ఫోర్స్ అధ్యక్షురాలు జయ జైట్లీ ఏడాది కాలంగా ఈ విషయమై పలు అధ్యయనాలు చేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ నిర్ణయానికి జనాభ నియంత్రణ కోసం తీసుకున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. కాని జయ జైట్లీ ఈ విషయమై స్పందిస్తూ జనాభ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు అన్నట్లుగా తేల్చి చెప్పింది. అసలు అమ్మాయిల పెళ్లి వయసు విషయంకు జనాభాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా ఆమె పేర్కొన్నారు.
మాతృత్వ వయసు దీని ద్వారా పెరుగుతుందని.. తద్వారా మాతా మరణాల రేటు తగ్గుతుందనే ఈ నిర్నయాన్ని తీసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. మహిళ సాధికారత కూడా దీంతో సాధించవచ్చు అనే ఉద్దేశ్యం ఉందని పేర్కొన్నారు.
జయ జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ మొత్తం 15 ఎన్జీవోలతో కలిసి వర్క్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బాల్య వివాహాలు జరిగే ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించారు. ప్రతి ఒక్క చోట కూడా అమ్మాయిల పెళ్లి కనీస వయసు పెంపు విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది.
ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటే పెళ్లి ఆలస్యం చేయడం సాధ్యం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే అమ్మాయిలు జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేయడం అనేది మంచి ఉద్దేశ్యం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి కేంద్రం తీసుకు వచ్చిన ఈ కొత్త నిర్ణయం ఎంత వరకు అమలు అవుతుంది అనేది చూడాలి.