Begin typing your search above and press return to search.
వన్ సైడ్ లవర్..అమాయకురాలి గొంతుకోశాడు!
By: Tupaki Desk | 12 May 2018 5:45 AM GMTప్రేమ.. పెళ్లి.. ఏదైనా తమకు నచ్చినట్లే జరగాలన్నట్లుగా కోరుకునే వారి మైండ్ సెట్ నేరాలకు నెలవుగా మారింది. తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం పోలీసు వర్గాలతో పాటు.. పలువురిని షాక్ కు గురి చేసింది. ప్రేమించి.. పెళ్లికి నో చెప్పిందన్న కోపంతో మంచి మాటలతో రిసార్ట్ కు తీసుకెళ్లి మరీ చంపేసి వైనం సంచలనంగా మారింది.
హైదరాబాద్ నగర శివారులో ఉన్న ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన హత్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెబితే మాత్రం.. మరీ అంత దుర్మార్గంగా.. కిరాతకంగా ఎలా అంతమొందిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.
కొత్తురు మండలానికి చెందిన 21 శిరీష డిగ్రీ కంప్లీట్ చేసి.. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ లోని ఒక ఇనిస్టిట్యూట్లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఆమెకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ తో పరిచయం ఉంది. కాలేజీ డేస్ లో సీనియర్ అయిన అతగాడితో ఆమె స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు అతడ్ని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే వీరిద్దరి మధ్య మాటలు తిరిగి మొదలయ్యాయి. దీంతో.. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు శిరీష నో చెప్పింది. వేరే వారితో ఫ్రెండ్లీగా మాట్లాడటాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయాడు సాయి ప్రసాద్. తనకు దక్కని అమ్మాయి వేరే ఎవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో దుర్మార్గమైన ప్లాన్ వేశాడు.
ఆన్ లైన్ లో ప్రగతి రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసిన అతడు.. శిరీషకు మాయమాటలు చెప్పి రిసార్ట్స్ కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య పెళ్లి విషయమై వాదన మొదలై అది కాస్తా గొడవగా మారినట్లు చెబుతున్నారు. బాత్రూంకు వెళ్లిన శిరీషను ముందుగా సిద్ధం చేసుకున్న కత్తితో హతమార్చాడు. అనంతరం తన చేతికి గాయం చేసుకున్న అతగాడు.. ఇంటికి ఫోన్ చేసిన తాను సూసైడ్ చేసుకున్నట్లుగా చెప్పి.. తానున్న ప్రగతి రిసార్ట్స్ గురించి సమాచారం ఇచ్చాడు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ప్రగతి రిసార్ట్స్ వారికి సమాచారం అందించారు. అప్పటికే శిరీష మరణించినట్లు గుర్తించారు. మరోవైపు తాను ప్రేమించిన శిరీషను హత్య చేసిన అనంతరం సాయి ప్రసాద్ రిసార్ట్స్ నుంచి బయటకు వచ్చేశాడు. ఈ హత్య సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్కు తరలించారు.ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ప్రాణాల్ని తీసిన వైనం ఇప్పుడు అందరిని కలవరానికి గురి చేస్తోంది.