Begin typing your search above and press return to search.
ప్రేమోన్మాదం: నడి రోడ్డు మీద తగలెట్టేశాడే!
By: Tupaki Desk | 22 Dec 2017 3:52 AM GMTమాటల్లో చెప్పలేని దారుణం హైదరాబాద్ మహానగర రోడ్డు మీద జరిగింది. ప్రేమించలేదన్న కోపాన్ని పెట్టుకున్న ఉన్మాది.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న యువతిపై పెట్రోలు పోసి తగలబెట్టిన వైనం సంచలనంగా మారింది. అప్పటివరకూ చలాకీగా ఉన్న సదరు యువతి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలిన గాయాలతో నరకయాతన పడుతోంది.
ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న లాలాపేటలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఘోర ఘటన సంచలనం సృష్టించింది. లాలాపేట భక్తసమాజంలో నివసిస్తున్న 23 ఏళ్ల సంధ్యారాణికి తండ్రి చిన్నతనంలో మరణించారు. ముగ్గురు సోదరుల వివాహాలై వేర్వేరు చోట్ల ఉంటున్నారు. పెళ్లి అయినా పలు ఇబ్బందులు కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. తల్లితో పాటు ఉంటున్న సంధ్యారాణి డిగ్రీ పూర్తి చేసింది.
శాంతినగర్ చౌరస్తాలోని ఒక షాపులో అకౌంటెంట్ గా పని చేస్తోంది. ఇంటి బాధ్యతను తానే మోస్తోంది. ఇంటికి కాస్త దూరంలో ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు ఉంది. తరచూ అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మార్చేందుకు అతగాడు ప్రయత్నించగా.. సంధ్యారాణి అందుకు నో చెప్పింది. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగం చేసే కార్తీక్ సంధ్యారాణిని ప్రేమించానంటూ వెంటబడ్డాడు. ఇంట్లో ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఆమె నో చెప్పింది. అయినా వదలని కార్తీక్.. ఆమెను వెంటాడాడు. ఫోన్లో వేధింపుల పర్వానికి తెర తీశాడు. దీంతో.. సంధ్యారాణి అతడ్ని దూరంగా పెట్టింది.
దీంతో అక్కసు పెంచుకున్న కార్తీక్ సంధ్యారాణి మీద కక్ష పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఒంటరిగా నడిచి వెళుతున్న సంధ్యారాణి వెంట కార్తీక్ పడ్డాడు. వారి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన అతడు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ (కొందరు కిరోసిన్ అని చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు గురువారం రాత్రి వరకూ అధికారికంగా వెల్లడించలేదు. కాకుంటే.. శరీరం కాలిన తీవ్రత చూస్తే.. పెట్రోల్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి) సంధ్యారాణి మీద పోసేసి.. నిప్పంటించాడు.
వాగ్వాదం జరగటం.. ఆ వెంటనే పెట్రోల్ పోయటం లాంటి వరుస ఘటనల్లో రియాక్ట్ అయ్యేలోపు జరగాల్సిన దారుణం జరిగిపోయింది. బాధితురాలు పెట్టిన ఆర్తనాదాలతో అటుగా వెళుతున్న వారు స్పందించి ఆమెను గాయాల నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. 108కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంధ్యారాణి పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు బోరుమన్నారు.
తనను నిప్పు అంటించింది కార్తీక్ అని చెప్పిన సంధ్యారాణి అతడి ఫోన్ నెంబరు చెప్పటంతో పోలీసులు ఫోన్ చేశారు. తానే నిప్పంటించినట్లు ఒప్పుకున్న కార్తీక్ తాను పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పి.. కాసేపటికి లొంగిపోయాడు. రాత్రి 7.30 గంటల సమయంలో లాలాపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమంటే ప్రేమించిన మనిషి మీద కసి తీర్చుకోవటం కాదు. తెలిసి తెలియక తప్పులు చేసినా క్షమించటం.
ఇప్పుడే అందిన సమాచారం కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న సంద్యారాణి ఈ ఉదయం (శుక్రవారం) మరణించింది. కాలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.