Begin typing your search above and press return to search.
ప్రియుడి కోరిక కోసం చెల్లెల్ని బలిపెట్టిన అక్క.. ఈ దారుణం ఎక్కడంటే?
By: Tupaki Desk | 29 March 2022 12:30 PM GMTమానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అన్న మాటను చాలామంది చాలా విధాలుగా అన్వయించుకుంటారు. కానీ.. ఇటీవల చోటు చేసుకుంటున్న దారుణ ఉదంతాల్ని చూస్తున్నప్పుడు మాత్రం.. అప్పుడెప్పుడో చెప్పిన కారల్ మార్క్స్ చెప్పిన మాట అక్షర సత్యమనిపించక మానదు. ఆయన ఉన్న సమాజంలో మననుషుల మధ్య సంబంధాలు అలా ఉంటాయని చాలామంది భావించేవారు. గడిచిన కొన్నేళ్లుగా మన దేశంలోని మానవ సంబంధాల మధ్య మార్పులు పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్నాయి.
అప్పట్లో మార్క్స్ మాటల్ని తప్పు పట్టినోళ్లంతా.. ఆయన మాటల్ని కరెక్టు చేసే క్రమంలో ఆర్థిక సంబంధాలు కాదు ఆత్మీయ సంబంధాలుగా చెప్పేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కంటి పాపగా ఉండాల్సిన ఇంట్లోని వారే.. ఇప్పుడు అత్యాచారాలకు కారణమవుతున్న తీరు భయం కలిగించేలా మారటంతో పాటు.. ఎటువైపు వెళుతున్నామన్న ఆందోళనకు గురి చేసేలా మారుతోంది. ఇదంతా ఎందుకంటే.. పశ్చిమ బెంగాల్ లో తాజాగా వెలుగు చూసిన ఆరాచక ఘటనే. పదకొండేళ్ల బాలికపై ఆమెకు రెట్టింపు వయసున్న (22ఏళ్లు) వ్యక్తి అత్యంత కిరాతకంగా లైంగిక దాడి పాల్పడటం ఒక ఎత్తు అయితే.. దానికి కారణం బాధితురాలి అక్కేనన్న (వరుసకు) దారుణ నిజం నిర్ఘాంతపోయేలా చేస్తోంది. అసలేం జరిగిందంటే..
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బషీర్ హట్ సబ్ డివిజన్ కు చెందిన పదకొండేళ్ల బాలిక ఉంది. ఆమెకు వరుసకు అక్క అయ్యే అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాధిత బాలిక తన దగ్గర రాత్రంతా ఉండేలా గర్ల్ ఫ్రెండ్ ను ఒప్పించాడు. అందుకుగాను ఆమెకు కొంత డబ్బు.. సెల్ ఫోన్ ఆశ చూపాడు. దీంతో.. ఏ పాపం తెలియని చెల్లెల్ని ఆ కసాయికి అప్పజెప్పింది.
తన దారిన తాను ఇంటికి వెళ్లింది. ఆ బాలిక మీద కన్నేసిన ఆ క్రూర మృగం అత్యంత కిరాతకంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిర్భయను తలపించేలా ఉన్న ఈ ఉదంతంలో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. చనిపోయిందనుకున్న అతడు.. బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
తమ కుమార్తె ఎంతకూ ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి బాలికను గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడ్ని.. అతడికి సహకారం అందించిన బాలిక అక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తీవ్ర గాయాల బారిన పడిన బాలిక.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.