Begin typing your search above and press return to search.

వేధించిన మొగాళ్లతో సెల్ఫీ దిగింది

By:  Tupaki Desk   |   6 Oct 2017 5:58 PM GMT
వేధించిన మొగాళ్లతో సెల్ఫీ దిగింది
X
అమ్మాయిలు...స్త్రీల ర‌క్ష‌ణ గురించి ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా...ఎన్ని అవ‌గాహ‌న చ‌ర్య‌లు చేప‌ట్టినా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే రీతిలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. ఇలాంటి వేదింపుల‌కు ఏ ఒక్క‌చోటూ అతీతం కాదు..స్కూలు - ఆఫీసు - బ‌స్టాపు - రైల్వేస్టేష‌న్‌..ఇలా అన్నిచోట్లా ఇదే త‌ర‌హా ఇబ్బందులు. వీటిని మౌనంగా పంటి బిగువున భ‌రిస్తున్న‌వారు కొంద‌రైతే పోలీసుల‌ను ఆశ్ర‌యించిన వారు ఇంకొంద‌రు. అయితే ఓ అమ్మాయి ఇలా త‌న ఆవేద‌న‌ను కేవ‌లం పంటి బిగువ‌న అణుచుకోవ‌డ‌మో లేదంటే త‌ను ఒక్క‌దాని కోస‌మో పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్ల‌డ‌మో చేయ‌లేదు. ప్ర‌పంచం అంద‌రికీ తెలిసేలా ఆక‌తాయిలకు బుద్ధి చెప్పే ప‌ని చేసింది.

ఆమ్‌ స్టర్‌ డామ్ లో విద్యను అభ్యసిస్తున్న నోవాజాన్స్ త‌ను కాలేజీకి వెళుతున్న స‌మ‌యంలో లేదా మ‌రేదైనా ప‌ని మీద వెళుతున్న‌ప్పుడు అయినా బ‌స్టాపుల్లో ఆమెకు ఇలాంటి ఇబ్బందికర‌మైన‌ వేధింపులు త‌ప్పేవి కాదు. వీటిని చూసి ఆమె ప‌లు సంద‌ర్భాల్లో కుంగిపోయింది. అందుకు కొత్త ప‌రిష్కారం క‌నుక్కొంది నోవా. అదే వేధింపుల‌కు పాల్ప‌డిన వారితో సెల్ఫీలు దిగ‌డం. త‌న‌ను వేధించే మ‌గ‌వారితో ఆమె సెల్ఫీలు దిగి వాటిని తన సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేసేసింది. ఇలా త‌న‌ను వేధించిన 30 మంది మ‌గ‌వాళ్ల‌తో క‌లిసి దిగిన సెల్ఫీల‌తో పోస్ట్ చేసింది. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కొన్ని రోజుల్లో ఆమెకు 45వేల మంది పాలోవ‌ర్లు ఏర్ప‌డ్డారు. ఈ నెటిజ‌న్ల‌లో ప‌లువురు ఆమె చ‌ర్య‌ను ప్ర‌శంసించారు. ఆక‌తాయిల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఆమె చేసిన ప‌ని వారికి దిమ్మ‌తిరిగేలా ఉంద‌ని ప్ర‌స్తావించారు. ఇది ప‌లువురికి స్పూర్తిని ఇచ్చింద‌ని పేర్కొన్నారు.

ఈ ఆలోచ‌న‌పై నోవా మాట్లాడుతూ తాను రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తొలిసారి వేధింపులు ఎదురయ్యాయని ఆ క్ర‌మంలో తాను ఈ ఆలోచ‌న చేసిన‌ట్లు వివ‌రించింది. మహిళల దినచర్యలపై పురుషులకు మరింత అవగాహన తెచ్చేందుకే తాను ఈ ఆలోచ‌న‌ చేపట్టానని ఓ ప‌త్రికకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నోవా వెల్ల‌డించింది. త‌న‌తో సెల్ఫీలు దిగ‌న‌వారిలో ఒక్క యువ‌కుడు మాత్ర‌మే ఎందుకు ఇలా చేస్తున్నావ‌ని ప్ర‌శ్నించాడ‌ని తెలిపింది. అయితే...ఆమ్‌ స్ట‌ర్‌ డ‌మ్‌ లో వేదింపుల‌కు పాల్ప‌డితే 190 ఫ్రాంక్స్ ఫైన్ ఉన్న నిబంధ‌న‌ల నేప‌థ్యంలో...త‌న‌ను వేధించేందుకు ఎవ‌రూ ధైర్యం చేయ‌డం లేద‌ని తెలిపింది.