Begin typing your search above and press return to search.
ప్రియురాలి భాద్యత ప్రేమికుడిదే .. అలా వదిలేస్తే ఎలా !
By: Tupaki Desk | 1 Nov 2021 7:36 AM GMTప్రేమించిన అమ్మాయిని బయటకి తీసుకెళ్లే అబ్బాయి , ఆ అమ్మాయి భాద్యతను తీసుకోవాల్సిందే. ఆ అమ్మాయి ని తిరిగి మళ్లీ గమ్యస్థానానికి చేర్చేవరకు పూర్తి భాద్యత ఆ అబ్బాయిదే. సాముహిక అత్యాచారం కేసులో ప్రియడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని , అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని వెల్లడించింది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రియుడిదేనని ,సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపి, నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు, కుట్టుమిషన్ నేర్చుకోవడానికి ఇన్ స్టిట్యూట్ కు వెళ్లి, అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని బంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు బాధితురాలు అకిల్ సారాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉందని తెలిపింది. తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యవహారశైలి సందేహాత్మకంగా ఉందని, అలాగే మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేమని హైకోర్టు తెలిపింది. నిందితుడు రాజుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మేజర్ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.