Begin typing your search above and press return to search.
ఐపీఎల్ వేలంలో హీరో..కుక్క కోసం బొమ్మలు కొన్నాడట!
By: Tupaki Desk | 24 Dec 2019 5:30 PM GMTఅమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఒరిజిలన్ సిరీస్ లు ఆసక్తికరంగానే కాదు.. విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఆ కోవలోకి చెందింది ఇన్ సైడ్ ఎడ్జ్. ఐపీఎల్ ప్రధానాంశంగా సాగే ఈ సిరీస్ ను చూసినప్పుడు.. ఐపీఎల్ ఆట వెనుక ఇంత జరుగుతుందా? అన్న భావన కలుగక మానదు. అయితే.. ఈ సిరీస్ లో తాము ప్రస్తావించినవన్నీ కల్పితాలే అని చెప్పినా.. వాస్తవాల్ని స్ఫూర్తిగా తీసుకోకుండా ఇంత ఆసక్తికరంగా చెప్పటం అసాధ్యమనిపించక మానదు.
ఈ సిరీస్ మొత్తాన్ని చూసినప్పుడు.. ఇలానే రియల్ గా జరుగుతుందని చెప్పలేం కానీ..అంతో ఇంతో జరగకుండా ఉండదని మాత్రం చెప్పేస్తారు. తెర మీద కనిపించే ఐపీఎల్ గేమ్ వెనుక ఏం జరుగుతుందన్న విషయాలు మీడియాలో పెద్దగా రావు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ను భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ కొనుగోలు చేసిన వైనం చూసినప్పుడు చప్పుడు ఈ వెబ్ సిరీస్ కళ్ల ముందు కదలాడకమానదు.
వెబ్ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. ఈసారి వేలంలో అత్యధికంగా ధర పలికిన ఆటగాడిగా ఫ్యాట్ సంచలనంగా మారారని చెప్పక తప్పదు. అతడి కనీస ధర రూ.2 కోట్లు అయితే.. అతన్ని సొంతం చేసుకోవటం కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడినా.. చివరకు కోల్ కతా నైట్ రైడర్స్రూ.15.5 కోట్లు పెట్టి మరీ అతన్ని సొంతం చేసుకున్నాయి. రాత్రికి రాత్రి అంత భారీ మొత్తం వచ్చి పడితే ఎవరు మాత్రం ఉక్కిరిబిక్కిరి కారు చెప్పండి. ప్రస్తుతం ప్యాట్ పరిస్థితి ఇలానే ఉంది.
ఐపీఎల్ చరిత్రలో భారీ మొత్తాన్ని పొందిన తొలి విదేశీ ఆటగాడన్న పేరుతో పాటు.. వస్తున్న డబ్బును ఏంచేస్తామని అడిగితే.. ఊహించని సమాధానమిచ్చాడు. తనకు వచ్చిన డబ్బుకు సంతోషంగా ఉందన్న అతడు.. అంత మొత్తాన్ని ఏం చేయాలో తెలీటం లేదన్నారు. కాకుంటే తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనకొచ్చిన డబ్బుతో తన పెంపుడు కుక్కకు కొన్ని బొమ్మలు కొందామని చెప్పినట్లు వెల్లడించాడు.
‘‘ఆమెకు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. అందుకే దాని కోసం కొన్ని బొమ్మలు కొందామని చెప్పింది. మిగిలిన మొత్తంతో ఏం చేయాలో ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు’’ అని కమ్మిన్స్ పేర్కొన్నారు. ఐపీఎల్ లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు. మరింత ధర పెట్టి కొనుక్కున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు ఎలాంటి అనుభవం మిగులుతుందో చూడాలి.