Begin typing your search above and press return to search.

ఊరేగింపు ఏమో కానీ.. లేడీస్ ఫైటింగ్ వైరల్ అయ్యింది

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:00 AM GMT
ఊరేగింపు ఏమో కానీ.. లేడీస్ ఫైటింగ్ వైరల్ అయ్యింది
X
కారణం పెద్దగా బయటకు రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని మాత్రం.. చిట్టి వీడియో ఒకటి మాత్రం వైరల్ గా మారింది. చాలా అరుదుగా కనిపించే ఉదంతం ఒకటి దర్శనమిచ్చింది. యూత్ లో ఉన్న అమ్మాయిల మధ్య తేడా ఎందుకు వచ్చిందో తెలీదు కానీ.. జుట్లు పట్టుకొని నడిరోడ్డు మీద కొట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. హిందీ న్యూస్ చానల్ కు చెందిన పాత్రికేయురాలు ఒకరు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయటంతో ఇది మరింతగా పాపులర్ అయ్యింది.

అమ్మాయిలు రెండు గ్రూపులుగా విడిపోయి.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా.. కమ్ములాటకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఫైటింగ్ చేసుకోవటం.. అందరి జుట్లు వదిలేసి ఉండటంతో.. ఈ ఫైటింగ్ లో ఎవరికి వారు అవతలవారి జుట్లు పట్టుకొని కొట్టేసుకోవటం ప్రముఖంగా కనిపించింది.

ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో డీజే సౌండ్ వస్తున్న వైనం చూస్తే.. ఏదో ఒక ఊరేగింపు సందర్భంగా అమ్మాయిల గ్రూపులో వచ్చిన తేడాలు.. అంతకంతకూ ఎక్కువై.. చివరకు జుట్లు పట్టుకొని కొట్టేసుకునే వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

వీరి కోట్లాటతో చుట్టుపక్కల ఉన్న వారికి అసలేమీ అర్థం కాలేదు. కాషాయ దుస్తుల్లో ఉన్న ఒక కుర్రాడు కాస్తంత ముందుకు వచ్చి.. వారిని ఆపే ప్రయత్నం చేయటం.. ఆ తర్వాతే మరో వ్యక్తి రావటం.. ఇరువర్గాల్ని శాంతపరిచే ప్రయత్నం చేయటంతో.. ఎట్టకేలకు వీరి మధ్య సాగుతున్న కోట్లాట ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలోని బిష్రాంపూర్ ప్రాంతానికి చెందిన ఈ గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్ గా మారింది.

డీజేతో సాగుతున్న ఊరేగింపులో చోటు చేసుకున్న గొడవ పెద్దది కావటం.. అమ్మాయిలు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టేసుకోవటం కనిపిస్తోంది. ఈ ఉదంతాన్ని అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి పోస్టు చేయటం.. దానికి సంబంధించిన వీడియోను తాజాగా మరికొందరు షేర్ చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. నడిరోడ్డు మీద తన్నేసుకున్న ఈ ఉదంతంపై పలువురు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.