Begin typing your search above and press return to search.
పెళ్లికి కొత్త కండీషన్ పెడుతున్న అమ్మాయిలు
By: Tupaki Desk | 31 Oct 2017 5:30 PM GMTఅప్పుడెప్పుడో కన్యాశుల్కం ఉండేదట. అది పోయి వరకట్నం వచ్చింది. పెళ్లికి అబ్బాయి కోసం అమ్మాయి తరఫు వాళ్లు భారీగా ముట్టచెబితే తప్పించి వరుడు పెళ్లిపీటల మీదకు ఎక్కని పరిస్థితి. ఈ బాధ భరించలేక ఎందరో అమ్మలు.. అమ్మాయిలు పుడుతున్నారంటే చాలు గర్భాన్ని తీయేసుకునేవాళ్లు. ఏళ్లకు ఏళ్లుగా సాగిన ఈ దుర్మార్గం పుణ్యమా అని ఇప్పుడు అమ్మాయిలకు కొరత వచ్చేసింది.
అబ్బాయిలు బోలెడంత మంది పెళ్లికి ఉన్నా.. అమ్మాయిలు మాత్రం పెళ్లికి ఓకే అనాలంటే సవాలచ్చ కండీషన్లు పెడుతున్నారు. అమ్మాయిలు తక్కువ కావటంతో పాటు.. సామాజికంగా.. ఆర్థికంగా అమ్మాయిలు ఎవరికి వారు వారి.. వారి కాళ్ల మీద నిలబడటం.. ఎవరి మీదా ఆధారపడాల్సిన దుస్థితి లేకపోవటంతో అబ్బాయిల పరిస్థితి మహా ఇబ్బందిగా మారింది.
గతంలో మాదిరి తనను అబ్బాయి ఓకే అంటాడా? అనడా? అన్న టెన్షన్ లేదు. ఇప్పుడదంతా అబ్బాయి ఖాతాలోకి వెళ్లిపోయింది. అమ్మాయి తనను ఓకే అంటే చాలన్నట్లుగా పరిస్థితి మారింది. పెళ్లిళ్ల విషయంలో అమ్మాయిలు ఎంత క్లారిటీగా ఉన్నరన్న విషయం తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే.. అమ్మాయిల ఇష్టాయిష్టాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
దేశంలో అమ్మాయిలు పెళ్లికి ఓకే అనాలంటే.. పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు అస్సలంటే అస్సలు వద్దంటున్నారట. తమదైన ప్రపంచం ఉంటేనే ఓకే చెబుతున్నారట. ఉమ్మడి కుటుంబం అయితే తమకు స్వేచ్ఛ ఉండదని.. పరిమితులతో కాలం గడిపేయాల్సి వస్తుందని తేల్చి చెబుతున్నారట.
కులం.. మతం.. జాతకం లాంటి వాటికి ఇప్పటి అమ్మాయిలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నది తాజా అధ్యయన సారాంశం. అంతేకాదు.. తామున్న ప్రొఫిషన్ ఉన్న వారి సంబంధాలకే మొగ్గు చూపుతున్నారట. గతానికి భిన్నంగా హ్యాండ్సమ్ గా ఉండే అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారట.
దాదాపు 80 శాతం అమ్మాయిలు విదేశీ సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నారని.. 63 శాతం అమ్మాయిలకు మతం..కులంతో పట్టింపులు లేవని చెబుతున్నట్లుగా సదరు నివేదిక పేర్కొంది. 50 శాతం మంది జాతకాల అవసరం లేదని చెబితే.. 80 శాతానికి పైగా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉండమని తేల్చి చెబుతున్నారట. అబ్బాయిలు.. అమ్మాయిల కోర్కెల లిస్టు చూశారా?