Begin typing your search above and press return to search.
అమ్మాయిలు బీరు తాగితే ఏమవుతుందంటే....
By: Tupaki Desk | 24 Nov 2015 2:09 PM GMTమందుబాబులే ఉంటారా? ఇవాళ రేపు...మందు భామలు కూడా ఉన్నారు కదా. అలా సురపానం కాస్త సర్వజనానికి దగ్గర అయింది. అయితే పెద్దవారు పెగ్గులేయడం వేరు...విద్యార్థులు లాగించడం వేరు కదా. విద్యార్థులు అంటే అబ్బాయిలు అనుకునేరు. ప్రస్తుత కథ అమ్మాయిల గురించి. అమ్మాయిలే అయినప్పటికీ ఏ డిగ్రీ చదువుతున్న వారో అనుకునేరు...అపుడే ఇంటర్‌లో అడుగుపెట్టిన అమ్మాయిలు ఈ ఘనకార్యానికి ఒడిగట్టారు. తరగతి గదుల్లోనే రౌండ్లు వేసి దొరికిపోయిన ఆ అమ్మాయిలకు గట్టి షాక్ తగలింది.
ఈ ఆసక్తికరమైన అప్‌డేట్ జరిగింది పొరుగు రాష్ర్టం తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలలో. ఆ రాష్ర్టంలోని నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్న నలుగురు అమ్మాయిలు తాగిన మత్తులో ఉన్నట్లు క్లాస్ టీచర్ గుర్తించారు. ఇంత ఘోరం పాఠశాలలోనే జరగడం ఏంటని షాక్ కు లోనై...సదరు విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి చెప్పారు. ఈ విద్యార్థులందరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయగా ఆ నలుగురూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది.
ఇంతకీ ఈ పనికి ఎందుకు సిద్ధపడ్డారంటే.... ఆ తరగతులోని ఓ అమ్మాయి పుట్టినరోజు. ఆ సంబరాన్ని గ్రాండ్‌గా జరుపుకొనేందుకు ఏడుగురు విద్యార్థినులు మందు పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కూల్ డ్రింకు బాటిళ్లలో బీరు కలిపేసుకొని పాఠశాలకు వచ్చారు. అయితే, వాళ్లలో ముగ్గురు విద్యార్థినులు భయపడి ఆ కూల్ డ్రింక్ రూపంలోని బీరును తాగలేదు. మిగిలిన నలుగురూ తాగడంతో యవ్వారం బయటకు వచ్చింది.
పట్టపగలు క్లాస్ రూంలో ఈ ఘటన జరగడం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ప్రభుత్వ స్కూలు యాజమాన్యం షాక్ కు లోనైంది. జిల్లా విద్యాధికారికి విషయం చేరవేసి వారి అనుమతితో విద్యార్థులకు టీసీలు ఇచ్చింది.