Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: నడిరోడ్డుపై ప్రియుడి కోసం తన్నుకున్న అమ్మాయిలు

By:  Tupaki Desk   |   13 April 2022 8:25 AM GMT
వైరల్ వీడియో: నడిరోడ్డుపై ప్రియుడి కోసం తన్నుకున్న అమ్మాయిలు
X
సహజంగా ఒక అందమైన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూసి ఉంటాం. కానీ ట్రైయిన్ రివర్స్ అయ్యింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు తన్నుకున్నారు. జుట్లు పట్టుకొని నడిరోడ్డుపై గొడవపడ్డారు. ఈ వీడియో ఎవరో ఒకరు తీయడంతో అదిప్పుడు వైరల్ గా మారింది.

సుమారు 10 మంది వరకూ అమ్మాయిలు ఉన్న నడి రోడ్డుపై బ్యాగులు తగిలించుకున్న అమ్మాయిలు గొడవపడ్డారు. కాలేజీ అమ్మాయిలంటే బుద్దిగా క్లాసులకు వెళ్లి.. తిరిగి ఇంటికి రావాలి.. కానీ ఇక్కడ వీళ్లు జట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. పక్కన వాళ్లు విడిపిస్తున్నా ఆగకుండా..నడిరోడ్డు మీదే చెడా మడా కొట్టుకున్నారు. వీళ్లకేమీ పెద్ద పంచాయితీలు ఏమీ లేవు. ఇంటిదగ్గర గొడవలు కాదు.. ఓ అబ్బాయి కోసం ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నై మహానగరం నడిబొడ్డున ఈ ఘటన జరిగింది. ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వాళ్లిద్దరికీ చాలా లేట్ గా తెలిసింది. ‘వాడు నా వాడు అంటే నా వాడు’ అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. నువ్వు మర్చిపోవాలంటే నువ్వే మర్చిపో అంటూ ఘర్షణకు దిగారు.

ఇది కాస్తా శృతి మించడంతో ఇలా రోడ్డు మీదే తన్నుకున్నారు. అక్కడున్న తోటి విద్యార్థులు ఈ ఫైటింగ్ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

కాలేజీ విద్యార్థులు ఇలా నడిరోడ్డుపై తన్నుకుంటున్న తీరు చూసి రోడ్డునపోయే వారందరూ షాక్ అయ్యారు. కొంతమంది వచ్చి ఆపే ప్రయత్నాలు చేశారు. ఎందుకు కొట్టుకుంటున్నారని ప్రశ్నించగా బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పడంతో విన్నవారంతా గడ్డిపెట్టారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.