Begin typing your search above and press return to search.

అమ్మాయిలు ఈ టైప్ అబ్బాయిలనే ఇష్టపడతారట.?

By:  Tupaki Desk   |   30 July 2020 11:30 PM GMT
అమ్మాయిలు ఈ టైప్ అబ్బాయిలనే  ఇష్టపడతారట.?
X
సల్మాన్ ఖాన్ లా కండలు పెంచి , మీసాలు తీసిసి.. దృఢమైన శరీరం కలిగిన వారిని అమ్మాయిలు ఇష్టపడతారా.? లేక సాఫ్ట్ గా , సున్నితంగా లేలేత బుగ్గలు కలిగి.. కండలు , ఎక్సర్ సైజ్ బాడీ లేని మహేశ్ బాబును ఎక్కువగా ఇష్టపడతారా.? లేక అటు కండలు పెంచి.. ఇటు సాఫ్ట్ గా ఉండే ప్రభాస్ అంటే అమ్మాయిలకు ఇష్టమా..? అసలు మహిళలు తమను సుఖపెట్టడానికి, కాబోయే భర్త ఎలా ఉండలనుకుంటున్నారనే దానిపై ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు సర్వే చేశారు. ఆ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారానే దానిపై ఇటీవల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది.. అమ్మాయిలందరూ ఎక్కువగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను క్రోడీకరించి ఈ సర్వే విడుదల చేశారు. అమ్మాయిలు తమపై ఆధిపత్యం చలాయించే మగవాళ్లను అస్సలు ఇష్టపడరట.. తమ మాట వినే సున్నిత, అమాయకపు మగవాళ్లనే ఇష్టపడతారట..

ఇక కండలు తిరిగి, ఎక్సర్ సైజ్ బాడీ కలిగి సెక్స్ లో రెచ్చిపోయే మగాళ్ల అంటే ఆడవాళ్లకు అస్సలు ఇష్టం ఉండదట.. సాఫ్ట్ గా, కూల్ గా.. అమ్మాయిలను అర్థం చేసుకొనే అందంగా ఉండే మగాళ్లు అంటేనే ఎక్కువగా ఇష్టపడతారట.. సెక్స్ విషయంలో బలవంత పెట్టకుండా అమ్మాయిని అర్థం చేసుకొని సుకుమారంగా చేసే మగాళ్లు అంటే ఎక్కువగా ఇష్టమట..

ఇలా లేలేతగా ఉంటూ అమ్మాయిల మాటలు వింటే సాఫ్ట్ గా సున్నితంగా ఉండే మగాళ్లు అంటే అమ్మాయిలు ఇష్టపడతారని తేలింది. ముఖ్యంగా ఆడవాళ్లలాగా ముఖ వచ్చస్సు ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ ఇష్టమని తేలింది. సో ఇక అబ్బాయిలందరూ ఈ సర్వే చూశాక అలా ప్రవర్తించడం నేర్చుకోండి.