Begin typing your search above and press return to search.
అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దు.... పాటించకపోతే కఠిన శిక్షలంటూ.. !
By: Tupaki Desk | 10 March 2021 11:42 AM GMTజీన్స్ ... ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా వేసుకునే కామన్ డ్రెస్. అమ్మాయిలు , అబ్బాయిలు అన్న తేడా లేకుండా అందరూ జీన్స్ వేస్తున్నారు. అందరికీ కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది జీన్స్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అయితే, అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దంటూ ఓ పంచాయితీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన క్షత్రియ పంచాయతీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దు అని క్షత్రియ పంచాయతీ తీర్మానించింది. ఈ కట్టుబాటును కాదని ఎవరైనా అమ్మాయిలు జీన్స్ ధరించినట్లయితే వారిపై సంఘ బహిష్కరణ విధిస్తామని హెచ్చరికలు జారీచేశారు.
అదేవిధంగా, అబ్బాయిలు కూడా నిక్కర్లు ధరించవద్దని, అలాకాదని నిక్కర్లు ధరించేవారికి కూడా ఇదే జరిమానా ఉంటుందని క్షత్రియ పంచాయతీ స్పష్టం చేసింది. అమ్మాయిలు జీన్స్ ధరించి తిరుగుతుండటం వల్ల వేధింపులు ఎక్కువవుతున్నాయని క్షత్రియ పంచాయతీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలా కాకుండా అమ్మాయిలపై వేధింపులు తగ్గాలంటే .. అమ్మాయిలు జీన్స్ ధరించకుండా ఉండాలని మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమై దీనిపై చర్చించి ఈ మేరకు ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలుచేయనున్నట్లు ప్రకటించింది.
క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని క్షత్రియ పంచాయతీ పెద్దలు తెలిపారు. అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని, అబ్బాయిలు నిక్కర్లు వేసుకోవద్దని, ఈ కట్టుబాట్లను అతిక్రమించినవారికి జరిమానా విధిస్తామని, ఎక్కువ సార్లు పట్టుబడితే సంఘ బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ పంచాయితీ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.