Begin typing your search above and press return to search.

మూఢ న‌మ్మ‌కానికి ప‌రాకాష్ట చూశారా?

By:  Tupaki Desk   |   28 Sep 2017 6:30 AM GMT
మూఢ న‌మ్మ‌కానికి ప‌రాకాష్ట చూశారా?
X
ఇది మూఢ‌న‌మ్మ‌కానికి పరాకాష్ట‌! కంప్యూట‌ర్ యుగంలోనూ కాలం చెల్లిన కొన్ని న‌మ్మ‌కాల కోసం మూర్ఖంగా వ్య‌వ‌హ‌రించిన తీరు! వెర‌సి మ‌నం ఇంకా ఆదిమ యుగంలోనే ఉన్నామా అని అనిపించే ఘ‌ట‌న‌! ఎక్క‌డో జ‌ర‌గ‌లేదు. మ‌న రాష్ట్రాన్ని ఆనుకునే ఉన్న త‌మిళ‌నాడులో జ‌ర‌గింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న వెలుగుచూడ‌డంతో మాన‌వ‌తావాదులు మండిప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంత‌లా జనాల్ని క‌దిలించిన ఆ ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకుందామా?

తమిళనాడు - మదురై జిల్లాలోని వెల్లూర్ గ్రామంలోని యజైకథా అమ్మన్‌ ఆలయం ఉంది. ఇక్క‌డ తమిళ నెల ఆవానీ ప్రారంభ రోజున బాలికలు ఒకరోజు రాత్రి దేవుడి ఆలయంలో గడపాలి. ఇందుకోసం పది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఏడుగురు అమ్మాయిలను ఆలయ పూజారి ఎంపిక చేస్తారు. అనంతరం వారిని అర్థనగ్నంగా మారుస్తారు. శరీర పైభాగంపై పూలు - ఆభరణాలు మాత్రమే ధరింపజేసి ఒకరోజు రాత్రంతా ఆల‌యంలోనే ఉంచుతారు. వారితోపాటు పూజారి ఆలయంలోనే గడుపుతారు.

ఈ తంతు కోసం గత మంగళవారం నుంచి గ్రామంలో ఆలయ పూజారి - ఆయన అనుచరులు బాలికలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. దీంతో గ్రామంలోని 62 మంది బాలికలు భయంతో పారిపోయారు. ఈ సంఘటనపై విద్యాశ్రీ ధర్మరాజ్‌ అనే సంపాదకురాలు తన వెబ్‌ సైట్‌ 'కోవైపోస్టు'లో వీడియోతో పాటు ప్రత్యేక కథనం ఇచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఆ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. దీంతో రెచ్చిపోయిన పూజారి - ఆయన అనుచరులు.. చంపేస్తామంటూ విద్యాశ్రీను ను ఫోన్‌ లో బెదిరించారు. సో.. మొత్తానికి ఈ ఘ‌ట‌న తాత్కాలికంగా ఆగిపోయినా త‌మ సంప్ర‌దాయాల‌ను తాము కాపాడుకుంటామ‌ని పూజారి హెచ్చ‌రిచ్చ‌డం కొస‌మెరుపు. మ‌రి నాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నామా? అని అనిపిస్తోంది క‌దూ!