Begin typing your search above and press return to search.
సెల్ఫీ పిచ్చి.. వరదలో చిక్కుకున్న అమ్మాయిలు !
By: Tupaki Desk | 25 July 2020 12:30 AM GMTఈ మధ్య కాలంలో సెల్ఫీ ఓ ట్రెండ్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ తీసుకోవడం .. సోషల్ మీడియా లో స్టేటస్ అప్లోడ్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అయితే ,చిత్ర విచిత్రమైన సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ ఎంతోమంది ఎన్నో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కొంతమంది సెల్ఫీ తీసుకుంటూ .. అనుకోకుండా ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ, చివరి క్షణంలో అప్రమత్తమై ప్రాణాలు నిలబెట్టుకున్నారు. సెల్ఫీ పిచ్చితో ఓ నది మధ్యలో ఉన్న రాళ్లపైకి వెళ్లారు. ఆ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుడగా నదికి వరద పోటెత్తింది. దీంతో ఇద్దరు వరదలోనే చిక్కుకుపోయారు. ఆ తర్వాత పోలీసులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మద్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో యువతీయువకులు ఖాళీగానే ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఎనిమిది మంది అమ్మాయిలు తమ గ్రామానికి సమీపంలో ఉన్న పెంచ్ నది వద్దకు వెళ్లారు. అక్కడ వాతావరణం చల్లగా ఉండడంతో ఎంజాయ్ చేస్తూ ఫోటోల తీసుకోవడంలో మునిగిపోయారు. ఓ ఇద్దరు యువతులు నదిలో ఉన్న ఓ రాయి వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నారు. అంతలోనే ఒక్కసారిగా నదికి వరద పోటెత్తింది. ఆ ఇద్దరిని గమనించిన మిగతా అమ్మాయిలు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి ఆ ఇద్దరు అమ్మాయిలని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. ప్రాణాలతో బయటపడ్డ ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు, స్థానికులకు, ఫ్రెండ్స్ కు థ్యాంక్స్ చెప్పారు. మీరు కూడా ఎక్కడైనా సెల్ఫీ తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.