Begin typing your search above and press return to search.
డేటింగ్ కోసం అమ్మాయిలు అలా చేస్తున్నారట!
By: Tupaki Desk | 6 Jun 2018 4:46 AM GMTఒకరు నచ్చటం.. వారితో పరిచయం కోసం తిరగటం.. స్నేహం స్టార్ట్ చేయటం.. వారిలో తమకు నచ్చినవి ఉంటే ప్రపోజ్ చేయటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం.. వామ్మో.. ఇంత భారీ ప్రాసెస్ కు ఇప్పటి యూత్ నో అంటే నో అనేస్తున్నారు. ఎనభైల్లో కనిపించిన పరిచయ.. స్నేహాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
నచ్చేవాళ్లను సెలెక్ట్ చేసుకొని.. వారితో స్నేహానికి ప్రపోజల్ పెట్టేందుకు వీలుగా బోలెడన్ని యాప్స్ వచ్చేశాయి. అలాంటి వాటిల్లో టిండర్ యాప్ ఒకటి . యూత్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని చెప్పే ఈ డేటింగ్ యాప్ మీద నార్వేజియన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు.
ఇందులో భాగంగా డేటింగ్ ట్రెండ్ ఎలా ఉందన్న అంశంపై 19 నుంచి 29 ఏళ్ల వయసున్న కొద్దిమంది అబ్బాయిలు.. అమ్మాయిల్ని ప్రశ్నించారు. వీరితో మాట్లాడిన అనంతరం ట్రెండ్ ఎలా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టిండర్ యాప్ ను ఉపయోగించటంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్న విషయాన్ని గుర్తించారు. ఈ యాప్ ను ఉపయోగించే అమ్మాయిలు.. తమకు నచ్చిన అబ్బాయిల వ్యక్తిగత.. వృత్తిగత అంశాల్ని పరిశీలించి.. వారి నేపథ్యాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమేఓకే చెబుతున్నారట. దీని కోసం అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువసేపు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు.
తమకు నచ్చినోళ్లను ఎంపిక చేసుకోవటానికి అమ్మాయిలు ఇంతలా కసరత్తు చేస్తుంటే.. అబ్బాయిల తీరు మరోలా ఉంది. తమకు నచ్చినోళ్లను ఎంపిక చేసుకునేందుకు పెద్దగా టైం తీసుకోవటం లేదట.వారి ఆలోచన అంతా సెలక్షన్ కంటే.. తాము ఎంచుకున్న అమ్మాయిని ఎంత త్వరగా కలుస్తామన్న అంశం మీదనే ఫోకస్ పెడుతున్నారట.
ఇక.. ఈ యాప్ తో పరిచయమయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం.. వారితో జీవితాంతం బతుకుదామనుకున్న ఆలోచన కంటే.. స్వల్పకాలిక అనుబంధాల కోసం.. శారీరక అవసరాల కోసం ఈ యాప్ ను వాడే అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కారణంతోనే ఒకరు నచ్చకుంటే వారితో బ్రేకప్ చెప్పేసి.. వెంటనే మరొకరిని సెలెక్ట్ చేసుకోవటం ఎక్కువేనట. అలా అని అందరు అబ్బాయిలూ ఇదే తీరులో ఉంటారనుకుంటే తప్పులో కాలేసినట్లే. కొందరు అబ్బాయిలు ట్రెండ్ కు భిన్నంగా సీరియస్ గా ఒక అమ్మాయిని ఎంపిక చేసుకొని.. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకునే వారూ లేకపోలేదని చెబుతున్నారు.