Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరికి 'జాకెట్' యాడ్ ఇచ్చి.. సొంత మీడియాకు ఉత్తచేయి?
By: Tupaki Desk | 26 April 2022 10:30 AM GMTఅందరూ అనుకున్నట్లు చేస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అవుతారు? అంచనాలకు మించినట్లుగా ఉండే ఆయన తీరు ఎప్పటికప్పుడు అంతుచిక్కనిదిగా ఉంటుంది. మరో రోజులో టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది.
ఈ నెల 27 (బుధవారం) జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ ఇందుకు వేదిక కానుంది. ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతించేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. గతంలో అయితే.. కొవిడ్ కారణంగా సింఫుల్ గా చేశారనుకోవచ్చు. మరి.. ఏమైందో కానీ.. భారీ ఎత్తున నిర్వహించకుండా ప్లీనరీని మమ అన్నట్లుగా ఒక రోజుకే పరిమితం చేయటం అది కూడా లిమిటెడ్ ఎంట్రీలకే పరిమితం కావటం గమనార్హం.
తాజా ఆవిర్భావ దినోత్సవం '21'ది కావటం విశేషం. పార్టీ పెట్టి అప్పుడే 21 ఏళ్లు అవుతుందా? అనిపిస్తుంది కానీ.. అది నిజం. ఒక ప్రాంతీయ పార్టీ రెండు దశాబ్దాలకు పైనే నిలవటం.. మరిన్ని దశాబ్దాలు నిలిచే పార్టీ పునాదుల్ని బలంగా నిర్మించటం కేసీఆర్ మేధోతనానికి నిదర్శనంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. పార్టీ ఆవిర్భావ దినోత్సం రోజున మీడియాకు భారీ ఎత్తున ప్రకటలన్ని ఇవ్వటం మామూలే. అయితే.. ఈ విషయంలో తాజాగా కాస్తంత విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఎవరు అవునన్నా..కాదన్నా.. పార్టీకి సంబంధించినఏదైనా భారీ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు.. అందునా ఆవిర్భావ దినోత్సవం లాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మిగిలిన మీడియా సంస్థలతో పోలిస్తే.. సొంత మీడియా సంస్థలో ఎక్కువ ప్రకటనలు కామన్. అందుకు భిన్నంగా తాజా పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు కాస్తోకూస్తో నెగిటివ్ గా వార్తలు రాస్తుందన్న పేరున్న ఈనాడుకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటానికి జాకెట్ యాడ్ ఇచ్చేస్తే.
కేసీఆర్ మీద తరచూ నెగిటివ్ వార్తలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారన్న పేరున్న ఆంధ్రజ్యోతికి ఒక జాకెట్ యాడ్ తో పాటు.. మొదటి పేజీలో అర పేజీ యాడ్ రావటం గమనార్హం. విచిత్రంగా కేసీఆర్ సొంత మీడియాకు చెందిన పత్రికలో మాత్రం జాకెట్ యాడ్ లేదు. అంతేకాదు.. పత్రిక మొదటి పేజీ కింది హాఫ్ లో ఒక ప్రకటన ఇచ్చారు. అది హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేస్తున్న కేసీఆర్ కు స్వాగతం చెబుతూ ప్రకటన ఇచ్చారు.
ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కేసీఆర్ సొంత పత్రికలోని చివరి పేజీలో కింది హాఫ్ పేజీలో ఒక ప్రకటన వేశారు. అది కూడా మంత్రి కేటీఆర్ ను ఫోకస్ చేసేలా ఉండటం గమనార్హం. 21వ శతాబ్దపు నాయకుడిగా అభివర్ణిస్తూ.. టీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర నాయకుడు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రకటన మాత్రమే ఉండటం గమనార్హం. ఇక..ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీకి చెందిన పత్రికలో కానీ.. మిగిలిన ఇంగ్లిషు పత్రికల్లో కానీ ప్రకటన లేకుండా ఉండటం చూస్తే.. కాసింత ఆశ్చర్యానికి గురయ్యేలా ఉండటం ఖాయం.