Begin typing your search above and press return to search.

50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తాన‌న్న మాజీ జ‌వాన్

By:  Tupaki Desk   |   7 May 2019 6:27 AM GMT
50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తాన‌న్న మాజీ జ‌వాన్
X
దేశానికి ర‌క్ష‌ణగా ఉండే జ‌వాన్ల‌కు ఇచ్చే ఆహారం ఎంత దారుణంగా ఉందంటూ వీడియో క్లిప్ షేర్ చేసి సంచ‌ల‌నం సృష్టించిన మాజీ జ‌వాన్.. ఈ మ‌ధ్య‌న వార‌ణాసిలో మోడీపై స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆయ‌న నామినేష‌న్ అసంపూర్ణంగా ఉందంటూ దాన్ని తిర‌స్క‌రిస్తూ ఎన్నికల సంఘం అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

బీఎస్ ఎఫ్ మాజీ జ‌వానుగా అంద‌రికి సుప‌రిచితుడైన తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్ కు చెందిన వీడియో ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. ఇందులో రూ.50 కోట్లు ఇస్తే ప్ర‌ధాని మోడీని చంపేస్తాన‌ని తేజ్ బ‌హ‌దూర్ చెప్పినట్లుగా వీడియోల స్ప‌ష్టంగా వినిపిస్తోంది.

అయితే.. ఇది రెండేళ్ల క్రితం నాటి వీడియోగా చెబుతున్నారు. ఆ వీడియో త‌న‌దేన‌ని చెబుతున్న తేజ్ బ‌హ‌దూర్.. తాను అన‌ని మాట‌ల్ని అన్న‌ట్లుగా ఉన్నాయ‌ని.. ఆ వీడియో కుట్ర‌పూరిత‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ వీడియో విశ్వ‌స‌నీయ‌త మీద ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా వీడియోను చూసి తాను నిర్ఘాంత‌పోయిన‌ట్లుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు చెబుతున్నారు. రూ.50 కోట్లు ఇస్తే మోడీని చంపేస్తాన‌ని ఆయ‌న కొంత‌మందితో చెబుతున్నాడ‌ని.. ఇలాంటి సంఘ విద్రోహ‌క శ‌క్తుల వెనుక ఉండేది కాంగ్రెస్సేన‌ని ఆరోపించారు.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలో ఉన్న వ్యాఖ్య‌ల్ని తేజ్ బ‌హ‌దూర్.. త‌న స్నేహితుల‌తో మాట్లాడుతూ చేశార‌ని చెబుతున్నారు. ఈ వీడియోలో వినిపిస్తున్న సంభాష‌ణ చూస్తే..

తేజ్ బహదూర్: నాకు డబ్బులిస్తే.. మోదీని చంపేస్తా

స్నేహితుడు: మోదీని చంపగలవా?

తేజ్ బహదూర్: రూ.50 కోట్లు ఇవ్వండి

స్నేహితుడు: రూ.50 కోట్లా? మన దేశంలో అంత కష్టం. అదే పాకిస్థాన్‌ లో అయితే అంత ఇస్తారు

తేజ్‌ బహదూర్: లేదు, నేనలాంటి పనిచేయలేను. ఈ దేశానికి నేను విధేయుడిని.

స్నేహితుడు: కానీ ఆయన దేశ ప్రధాని

తేజ్‌ బహదూర్: లేదు, నేను దేశానికి అవిధేయుడిని కాలేను. ఇక్కడ డబ్బు సమస్య కాదు

స్నేహితుడు: నేనీ విషయాన్ని ఎందుకు అడుగుడుతున్నానంటే.. మోదీని రూ.50 కోట్లకు చంపేస్తానంటున్నావు

తేజ్‌ బహదూర్: లేదు - ఇది విశ్వసనీయతకు సంబంధించినది కాదు.. అంటూ ఆ సంభాషణ సాగింది.