Begin typing your search above and press return to search.
మిర్యాలగూడ ఇచ్చేయండి సారూ.. కామ్రేడ్ల ఒత్తిళ్లు మామూలుగా లేవుగా!
By: Tupaki Desk | 26 Dec 2022 5:48 AM GMTఒక్క మునుగోడులో విజయం కోసం.. కమ్యూనిస్టులతో చేతులు కలిపి తప్పు చేశామా? మొత్తానికే ఎసరు పెట్టుకున్నామా? ఇదీ..ఇ ప్పుడు బీఆర్ ఎస్ వర్గాల్లో వస్తున్న సందేహాలు. దీనికి కారణం.. మెజారిటీ స్థానాలను(అంటే.. మూడు జిల్లాల్లో) కమ్యూనిస్టులు కోరుతున్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్‌పై ఒత్తిళ్లు కూడా తెస్తున్నారు. ఈ పరంపరంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కూడా ఉండడం గమనార్హం.
పొత్తులో భాగంగా సీపీఎంకు కేటాయించాలని.. కామ్రెడ్లు ఇప్పటి నుంచి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. సీపీఎం, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు స్థానాలను అడుగుతున్నా రని సమాచారం. దీనిలో మిర్యాలగూడ వంటి కీలక స్థానాన్ని తమకు ఖచ్చితంగా ఇవ్వాలని కామ్రెడ్లు కోరుతున్నారు. ఇప్పటికి ఐదు సార్లు సీపీఎం అక్కడ విజయం సాధించింది.
కమ్యూనిస్టు పార్టీలకు బలమైన కేడర్ కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి మంచి అనుచర గణం ఉంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు తీసుకుని జూలకంటిని బరిలో దించాలని సీపీఎం నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సీపీఎం ప్రణాళికలు ఎలా ఉన్నా మిర్యాలగూడ టికెట్ వదులుకుంటే సిటింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటనే ప్రశ్న కారు పార్టీలో కలకలం రేపుతోంది.
అలాగని కమ్యూనిస్టులను వదులుకుంటే.. ఈ టికెట్ దక్కే పరిస్థితి కేసీఆర్‌కు లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సీటు సీపీఎంకు కేటాయించడంపై అధినేత మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్, మునుగోడులోనూ.. కామ్రెడ్‌లు కర్చీఫ్‌లువేసేశారు.
ఇటీవల బై పోల్‌కు ముందే.. వచ్చే ఎన్నికల్లో మునుగోడును తమకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారట. ఇప్పుడు మిర్యాలగూడను కూడా కోరుతున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.