Begin typing your search above and press return to search.

ఇమ్రాన్‌ ఖాన్‌ భయపడ్డాడు

By:  Tupaki Desk   |   25 Feb 2019 5:52 AM GMT
ఇమ్రాన్‌ ఖాన్‌ భయపడ్డాడు
X
భారత్‌ లో ఉన్న జనాభా - వనరులు - ఆయుధ సంపత్తి.. ప్రపంచదేశాల్లో భారత్‌ కు ఉన్న మద్దతతో పోల్చుకుంటే.. పాకిస్థాన్‌ జుజుబి అనే విషయం ఆ దేశ అధ్యక్షుడైన ఇమ్రాన్‌ఖాన్‌కు తెలుసు. ఇమ్రాన్‌ ఇప్పుడంటే పాక్‌ ప్రధాని కానీ.. పదేళ్ల క్రితం వరకు క్రికెట్‌ మ్యాచ్‌ లనీ - కామెంటరీ అనీ ఇక్కడే బతికేశాడు. అందుకే.. ఇండియా జోలికి రావాలంటే కొంచెం ఆలోచిస్తాడు. కానీ ఆలోచిస్తున్నట్లు కన్పించకూడదు కాబట్టి కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. పుల్వామా దాడిలో పాకిస్తాన్‌ ప్రమేయం లేదని చెప్పాడు. ఆధారాలుంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

ఇదే సమయంలో.. ఇమ్రాన్‌ ఖాన్‌ కు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు మోదీ. నువ్వు పఠాన్‌ ల బిడ్డవి అయితే అబద్ధాలు ఆడకు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటావా అని ప్రశ్నించారు. మోదీ వార్నింగ్‌ కు భయపడిన ఇమ్రాన్‌ ఖాన్‌.. దెబ్బకు దిగివచ్చాడు. ఆధారాలు ఉంటే ఇవ్వాలని.. వెంటనే చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు. మోదీ వార్నింగ్‌ తో పాటు.. మూడు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా పాకిస్తాన్‌ తీరుని తప్పుబట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా ఉగ్రవాదం విషయంలో పాక్‌ తన బుద్ధి మార్చుకోవడం లేదని వార్నింగ్‌ ఇచ్చాడు. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ కూడా భారత్‌ జోలికి వస్తే అవ్వాయ్‌ సువ్వాయ్‌ లు వేసినంత ఈజీగా అణుబాంబులు వేస్తామని హెచ్చరించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కు వస్తున్న మద్దతులో ఇమ్రాన్‌ ఖాన్‌ కు భయం పట్టుకుంది. అందుకే.. వెంటనే చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు. మరి ఇప్పటికే పాక్‌ తన కుక్కబుద్ధి మార్చుకుంటుందో లేదో.