Begin typing your search above and press return to search.
వీలైనన్ని ఉపముఖ్యమంత్రి పదవులు ఇస్తారట!
By: Tupaki Desk | 14 Dec 2019 6:22 AM GMTకావాల్సినంత మందికి మంత్రి పదవులు, వీలైనంత మందికి ఉపముఖ్యమంత్రి పదవులు.. ఇదే ప్రస్తుతానికి కర్ణాటకలో కమలం పార్టీ ఫార్ములా. ఇటీవల ఉప ఎన్నికల్లో మంచి స్థాయిలో సీట్లను నెగ్గడంతో కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ సులభం అయ్యింది. మినిమం మెజారిటీ అయితే లభించింది.
అయితే ఇప్పటికీ ఉన్నది బోటాబోటీ మెజారిటీనే. మళ్లీ ఒక డజను మంది అలిగారంటే పరిస్థితి తారుమారు అవుతుంది. అందులోనూ కాంగ్రెస్, జేడీఎస్ లకు తిరుగుబాటు చేసి బీజేపీతో జత కలిసిన వారందరికీ మంత్రి పదవులు అంటూ హామీ ఇచ్చారట యడ్యూరప్ప!
తన ప్రభుత్వ ఏర్పాటుకు అప్పుడు అన్ని మాటలు చెప్పిన యడ్యూరప్ప, ఎన్నికల ప్రచారంలో కూడా వారికి మంత్రిపదవులు ఖాయమంటూ ప్రచారం చేశారు. వారిని గెలిపిస్తే మంత్రులు చేస్తానంటూ ప్రజలకు కూడా చెప్పారు. వారు గెలవడం జరగడంతో.. యడ్యూరప్పకు మంత్రి వర్గం విస్తరణ తలనొప్పిగా మారిందని సమాచరాం.
పన్నెండు మందిని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలి. వీరిని తీసుకుంటే.. పార్టీలోని పాతవాళ్లు అలుగుతారు. ఉన్న ఖాళీ బెర్తులు తక్కువే. దీంతో ఇంతమందిని సంతృప్తి పరచడం యడ్యూరప్పకు తేలికేమీ కాదని తెలుస్తోంది.
వీరిలో వీలైనంతమందికి ఉపముఖ్యమంత్రి పదవులు ఖరారు అయ్యాయట. ఇప్పటికే డిప్యూటీ సీఎంలున్నారు. వారికి తోడు మరి కొందరికి కూడా ఆ హోదా ఇస్తారట. దీంతో కనీసం అరడజను మంది డిప్యూటీ సీఎంలు ఉంటారనే ప్రచారం సాగుతూ ఉంది. ఏపీలోనూ ఐదు మంది డిప్యూటీ సీఎంలున్నారు. తనకు పూర్తి మెజారిటీ ఉన్నా సీఎం జగన్ బడుగుబలహీన వర్గాల నేతలకు డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. అయితే కర్ణాటకలో మాత్రం... ప్రభుత్వం నిలబడానికే ఉపముఖ్యమంత్రి పదవుల జాబితా పెరుగుతున్నట్టుగా ఉంది!