Begin typing your search above and press return to search.
వాణీదేవికి ప్రమోషన్ ఇవ్వటం ఖాయమట.. త్వరలోనే ఆ పదవి
By: Tupaki Desk | 30 March 2021 10:30 AM GMTవడ్డించేటోడు మనోడైతే అన్న సామెతను గుర్తు చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిసార్లు వ్యవహరిస్తారు. కొందరి విషయంలో కఠినంగా ఉండే ఆయన.. మరికొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీదేవి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఆమెకు ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన వాణీదేవిని హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దించటమే కాదు.. ఆమె గెలుపు కోసంఆయన ప్రదర్శించిన కమిట్ మెంట్ ను ఎవరూ మర్చిపోలేదు. గతానికి భిన్నంగా ఆయనే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రచారం మొదలు పోలింగ్ వరకు దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోవటంతో.. కష్టమనుకున్న ఆమె గెలుపు.. సులువుగా మారింది. ఎమ్మెల్సీగా సభలోకి అడుగు పెట్టనున్న ఆమెను.. త్వరలోనే మండలి ఛైర్మన్ గా కానీ.. డిప్యూటీ ఛైర్మన్ గా కానీ ఎన్నుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పీవీ బ్రాండ్ ఇమేజ్ ను పార్టీకి కట్టబెట్టేందుకు వీలుగా పీవీ శతజయంతిని భారీగా నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆ ఇమేజ్ ను మరింత సొంతం చేసుకోవటానికి పావులు కదుపుతున్నారని చెప్పాలి. భవిష్యత్తులో పీవీ మాట వచ్చినంతనే టీఆర్ఎస్ గుర్తుకు వచ్చేలా ఆయన ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యక్తి ఇమేజ్ ను పెంచే విషయంలో ఆయన ప్రతినిధ్యం వహించిన కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయగా.. తాము మాత్రం అందుకు భిన్నంగా ఆయన ఖ్యాతిని మరింత విస్తరించేలా చేశామన్న క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ తపిస్తున్నారు.
దీనికి తోడు.. పీవీ నరసింహారావు ఇమేజ్ తో పాటు.. ఆయన సామాజిక వర్గాన్ని కూడా తమ పార్టీతో కలిసి నడిచేలా ఆయన తాజా ప్లానింగ్ ఉందని చెబుతున్నారు. తెలంగాణలో కులాల ప్రస్తావన తక్కువ. అనూహ్యంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బ్రాహ్మణ వర్గీయులంతా పీవీ కుమార్తె వెంట నడవాల్సిందంటూ సభలు పెట్టుకొని మరీ తీర్మానాలు చేయటం చూసినప్పుడు.. తెలంగాణ సమాజంలో వస్తున్న మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.
త్వరలో శాసన మండిలో ఛైర్మన్ గా.. డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న గుత్తా.. నేతిల పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో..ఆ రెండు పదవుల్లో ఒక దానిని వాణీదేవికి అప్పజెప్పటం ద్వారా.. పీవీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని మరోసారి అందరికి అర్థమయ్యేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా పీవీ ఇమేజ్ ను పార్టీకి సొంతం చేయటానికి కేసీఆర్ ప్లానింగ్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.