Begin typing your search above and press return to search.
తడుముతారంటే ఆనందం అంటున్న అల్లుడుగారు
By: Tupaki Desk | 12 April 2015 5:58 AM GMTనిజమే.. తనను తడుముతానంటే సంతోషం అంటన్నారు సోనియమ్మ ఇంట అల్లుడు రాబర్ట్ వాద్రా. గాంధీ కుటుంబానికి ఇంట అల్లుడు అంటే మాటలా? అందులోకి భావి భారత ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తెగ గొప్పలు చెప్పుకునే ప్రియాంకగాంధీ భర్తగారి హోదాలో ఇప్పటికే వాద్రా ఎంత హవా నడపాలో అంత నడిపారు.
పదేళ్ల.. తన అత్తమ్మ రిమోట్ పాలనలో తాను సైతం ఎంతోకొంత వెనకేసుకున్న రాబర్ట్‌వాద్రా ఈ దేశపు అల్లుడన్న కీర్తిని కాంగ్రెస్ నేతల పుణ్యమా అని పొందారు. గాంధీ కుటుంబానికి అల్లుడన్న ఒక్కహోదాతో 125 కోట్ల మందిలో అతి తక్కువమందికి మాత్రమే లభించే ఒక సదుపాయాన్ని పొందారు. దేశాధ్యక్షుడు.. ప్రధాని.. విమానయాన శాఖామంత్రి లాంటి అతి కొద్ది మందికి మాత్రమే కల్పించే విమానాశ్రయ తనిఖీల్లో అల్లుడుగారి పేరును చేర్చారు.
ఏ హోదాలో ఇంత వీవీఐపీ ట్రీట్‌మెంట్ అల్లుడుగారికి ఇస్తున్నారంటూ చాలామంది ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ విమర్శలు తట్టుకోలేక వాద్రా కిందామీదా పడ్డారు. తాను కోరుకోకుండానే ఇలాంటి సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పుకున్నా నమ్మేటోళ్లు లేని పరిస్థితి.
తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల వాద్రా హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో మాదిరి విమానాశ్రయాల్లో చెకింగ్‌లు చేయటం.. తనిఖీల్లో భాగంగా ఒళ్లంతా తడమటం లాంటివి ఇకపై చేస్తారు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అల్లుడు వాద్రా స్పందిస్తూ.. గతంలో తాను కోరుకోకుండానే తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారని.. ఇప్పుడు మళ్లీ పాత విధానమే ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఎయిర్‌పోర్టులలో తనకిచ్చే మర్యాదలపై వస్తున్న విమర్శల కథనాలు ఆగిపోవటం తనను సంతోషానికి గురి చేస్తుందని.. తడిమే విషయంలో తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. తనను కోరకుండానే నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పుడు అదే విధంగా గౌరవాన్ని మినహాయించారని.. దీంతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మీడియాలో ప్రత్యేక మర్యాదలపై కథనాలు రావటం ఆగిపోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.