Begin typing your search above and press return to search.
ఈ బోగీ.. ఆ ప్యాసింజర్ రైలుకే..!
By: Tupaki Desk | 30 March 2016 6:14 AM GMTఈ అద్దాల రైలు బోగీ చూస్తే .. ఎప్పుడెప్పుడు ఎక్కుదామనిపించేలా ఉంది కదూ. ఇలాంటి బోగీలో సాయంత్రం పూట పైన ఆకాశాన్ని చూస్తూ జర్నీ చేస్తే ఎంత బాగుంటుందో కదా!
ఈ బోగీలో ఎక్కి ప్రయాణం చేసే రోజు త్వరలోనే రానుంది. అయితే.. ఈ అత్యాధునిక బోగీ ఉండే ట్రైన్ వింటేనే నోటి వెంట మాట రాదు. చుట్టూ అద్దాలతో.. లోపల బయట ఉన్నదంతా లోపలి వాళ్లకు స్పష్టంగా కనిపించే ఈ గ్లాస్ బోగీ.. ఒక ప్యాసింజర్ ట్రైన్ కు జత చేస్తున్నారు.
ప్యాసింజర్ రైలుబండి అనగానే.. డొక్కు బోగీలు గుర్తుకు వస్తాయి. అలాంటిది ఈ గ్లాస్ బోగీని ప్యాసింజర్ ట్రైన్‌కి ఎందుకు వినియోగిస్తారన్న డౌట్ రావొచ్చు. కానీ.. సదరు ప్యాసింజర్ ట్రైన్ పేరు చెబితే.. అధికారుల నిర్ణయం ఎంత కరెక్టో అనుకోకుండా ఉండలేం. విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలులో ప్రకృతి అందాల్ని చూడటం ఒక మదురానుభూతి. అలాంటి అందమైన అనుభూతిని కల్పించేందుకు రైల్వే అధికారులు తీసుకున్న ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇందులో భాగంగా.. ఈ గ్లాస్ బోగీని సిద్ధం చేశారు. త్వరలో ఈ కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ కు ఈ అద్దాల బోగీని జత చేస్తున్నారు. ఈ బోగీలో ఎక్కితే.. ప్రకృతి అందాల్ని ఓ రేంజ్‌లో చూసేయొచ్చు. ప్రకృతి అందాల్ని ఫుల్‌గా చూసేయాలనుకునే వారికి ఇంతకు మించిన అద్భుత అవకాశం ఇంకేం ఉంటుంది చెప్పండి.