Begin typing your search above and press return to search.
ఎమిటీ ఫ్యావిపిరవిర్? ఎందుకంత సంచలనం?
By: Tupaki Desk | 21 Jun 2020 9:45 AM ISTశనివారం సాయంత్రం వేళలో.. ఒక పోస్టు మీడియాను.. సోషల్ మీడియాను.. వాట్సాప్ గ్రూపుల్ని తెగ ఊపేసింది. మాయదారి రోగానికి మందు వచ్చేసిందని.. దాని పేరు ‘ఫ్యావిపిరవిర్’ అంటూ తెగ వైరల్ అయ్యింది. దీన్ని తయారు చేసిన కంపెనీగా గ్లెన్ మార్క్ ఫ్యార్మాస్యూటికల్స్ అంటూ భారీ ఎత్తున ప్రచారం సాగింది. అంతకంతకూ ఎక్కువ అవుతున్న పాజిటివ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మహమ్మారికి మందు వచ్చేసిందంటూ సాగిన ప్రచారంతో ఒకలాంటి సంతోషం చాలా మందిని చుట్టు ముట్టేసింది.
మహమ్మారికి ముందు కనుగొనటం.. అది కూడా ఉత్పత్తి పూర్తి అయ్యేవరకూ సమాచారం బయటకు రావటం విస్మయానికి గురి చేసేదే. ఇంతకీ ఈ సమాచారంలో నిజం ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఫ్యావిపిరవిర్ మందును ఫ్యాబిఫ్లూ బ్రాండ్ తో మార్కెట్లోకి రానున్న ఈ మందు కరోనాను చెక్ చెప్పదు. కాకుంటే ఆ వ్యాధి తీవ్రతను తగ్గి.. త్వరగా కోలుకునేలా చేస్తుంది. సదరు కంపెనీ చెప్పిన దాని ప్రకారం నాలుగైదు రోజుల పాటు ఈ మందును వాడితే వైరల్ లోడ్ తగ్గుతుందని.. రోగి కోలుకునే అవకాశం వస్తుందని చెబుతున్నారు. తమ సొంత రీసెర్చ్ తో డెవలప్ చేసినట్లుగా గ్లెన్ మార్క్ చెబుతోంది.
ఈ మందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. కరోనా వ్యాధి ఒక మాదిరి నుంచి మధ్య స్థాయిలో ఉన్న రోగులకు ఈ మందును ఇస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువన్నది కంపెనీ మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ మందు మాయదారి రోగం కారణంగా వైద్య ఆరోగ్యశాఖ మీద పెరిగే ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందంటున్నారు.
ఈ మందును జపాన్ లోని అవిగన్ అనే బ్రాండెడ్ ఔషధంగా ఆరేళ్ల క్రితం నుంచి వాడుతున్నారు. ఇన్ ఫ్లుయంజా వ్యాధి నుంచి కోలుకోవటానికి ఇది బాగా పని చేస్తుందని జపాన్ వైద్యులు సిఫారుసు చేస్తున్నారు. ఫ్యూజీ ఫిల్మ్ గ్రూపునకు చెందిన టయోమా కెమికల్ కంపెనీ అవిగన్ ఈ మెడిసిన్ ను తయారు చేస్తుంది.
ఈ మందును హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అప్టిమస్ ఫార్మా.. ఎవరెస్ట్ ఆర్గానిక్స్.. తదితర కంపెనీలు కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. నోటి ద్వారా తీసుకునే ఈ మాత్రను వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అమ్ముతారు. ఒక్కో టాబ్లెట్ రూ.103కు అమ్ముతారు. ఇంతకీ ఈ మెడిసిన్ ను ఎలా వాడాలన్న విషయానికి వస్తే.. తొలిరోజు 1800 ఎంజీ డోసు రెండుసార్లు.. తర్వాత రెండు వారాల పాటు రోజుకు 800 ఎంజీ డోసు చొప్పున వాడాల్సి వస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే.. ఇదంతా వైద్యుల సూచన తోనే చేయాలే తప్పించి.. సొంతంగా వాడకూడదని స్పష్టం చేస్తున్నారు.