Begin typing your search above and press return to search.
గజల్ పై ఆ సంస్థ సస్పెన్షన్ వేటు!
By: Tupaki Desk | 3 Jan 2018 12:19 PM GMTఆలయవాణి వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గజల్ నీచ కార్యాలకు సంబంధించిన మరిన్ని వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసిన విషయం విదితమే. ఆ యువతి ఫిర్యాదుతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతోన్న గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. గజల్ కు బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీగా చలామణీ అవుతోన్న గజల్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందని వారు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసేందుకు గజల్ శ్రీనివాస్ ను పోలీసు కస్టడీకి అనుమతించాలని వారు కోరారు. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానంలో గజల్ తరపు న్యాయవాది నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో గజల్ శ్రీనివాస్ ను కావాలనే కుట్రపూరితంగా ఇరికించారని ఆరోపించారు. గజల్ అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని, ఆయనపై సెక్షన్లు కూడా ఎక్కువగా నమోదు చేశారని తెలిపారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిపై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.
తాజాగా, గజల్ శ్రీనివాస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సేవ్ టెంపుల్స్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్ ను తొలగించారు. ఈ ప్రకారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశ్ రావు వెలగపూడి అధికారికంగా ఓ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ సంస్థ లో మహిళలకు చాలా గౌరవమిస్తామని చెప్పారు. తమ సంస్థ పేరు చెప్పుకొని ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని- మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడే వారికి తమ సంస్థలో చోటు లేదని హెచ్చరించారు. శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేయాలని సంస్థ నిర్ణయం తీసుకుందన్నారు.