Begin typing your search above and press return to search.
గ్లోబల్ వార్మింగ్ కి మీ బెడ్ రూంకి సంబంధం ?
By: Tupaki Desk | 5 Nov 2015 10:30 PM GMTఅమాయకత్వంతో కానీ.. అహంభావంతో కానీ మనిషి చేసే తప్పులు అతడ్నే ఎంతలా దెబ్బ తీస్తాయన్న దానికి నిలువెత్తు నిదర్శనం గ్లోబల్ వార్మింగ్. కాలుష్యం ఓ రేంజ్ లో పెరిగిపోయి.. ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చేసే కార్యక్రమాల పుణ్యమా అని గ్లోబల్ వార్మింగ్ అనే హలాహలం ఇప్పుడు ప్రపంచాన్ని కమ్మేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ మీద ఎవరు ఎన్ని చెప్పినా ఎవరికి వారు సీరియస్ గా దృష్టి సారించటం తక్కువే.
అయితే.. ఈ నిర్లాక్ష్యానికి మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చేసిందని చెబుతోంది తాజా అధ్యయనం. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. దీని ప్రభావం ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా చూపించటం ఖాయమన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. గ్లోబల్ వార్మింగ్ ఫుణ్యమా అని ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. సెక్స్ కోరికలు - శృంగార సామర్థ్యం తీవ్రంగా పడిపోతాయని తేల్చారు.
ఎందుకంటే.. భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన రోజు నుంచి తొమ్మిది నెలల తర్వాత బర్త్ రేట్ కు.. చల్లగా ఉండే రోజుల అనంతరం తొమ్మిది నెలల తర్వాతకు మధ్యనున్న బర్త్ రేట్ మధ్య సొంతన లేదని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో సెక్స్ కోర్కెలు తగ్గుతాయని .. ఆ రోజుల్లో వారి సామర్థ్యం తక్కువగా ఉండటమేకాదు.. పురుషల వీర్యంలో నాణ్యత మీద కూడా ప్రభావం చూపుతుందని తేల్చారు. ఇక.. మహిళల్లోనూ సెక్స్ పట్ల అనాసక్తి వ్యక్తమవుతుందని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ బూచి.. మానవాళిని ఏ విధంగా నాశనం చేస్తుందనటానికి ఇదో చక్కటి ఉదాహరణ. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇంతకాలం తమకు నేరుగా ఎలాంటి నష్టం ఉండదని భావించే వారికి ఇదో హెచ్చరికగా చెప్పొచ్చు. గ్లోబల్ వార్మింగ్ విషయంలో జాగ్రత్త అత్యవసరం.