Begin typing your search above and press return to search.

ప్ర‌పంచాన్ని క‌మ్మేసిన మ‌హమ్మారి: కోటిన్న‌ర‌కు కేసులు.. ఆరు ల‌క్ష‌ల మర‌ణాలు

By:  Tupaki Desk   |   22 July 2020 3:30 PM GMT
ప్ర‌పంచాన్ని క‌మ్మేసిన మ‌హమ్మారి: కోటిన్న‌ర‌కు కేసులు.. ఆరు ల‌క్ష‌ల మర‌ణాలు
X
మాన‌వ ప్రపంచాన్ని మ‌హ‌మ్మారి వైర‌స్ క‌మ్మేసింది. అన్ని దేశాల‌ను ఆ వైర‌స్ చుట్టే తీవ్ర రూపం దాల్చింది. భూ మండ‌లాన్ని ఆ వైర‌స్ జ‌ల‌గలా ప‌ట్టి పీడిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో జీవిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంది. తాజాగా ప్ర‌పంచవ్యాప్తంగా ఆ వైర‌స్ కేసులు ఏకంగా కోటిన్న‌ర‌కు చేరాయి. మృతుల సంఖ్య ఆరు ల‌క్ష‌లు దాటాయి. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఈ సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరుగుతోంది. ఈ విధంగా వైర‌స్ ఏకంగా ప్రపంచ‌లోని 213 దేశాలకు పాకింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా 1,51,16,495 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వైర‌స్‌తో మృతి చెందిన వారి సంఖ్య 6,20,032. ఈ విధంగా కేసులు కోలుకున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వైర‌స్ బారిన ప‌డి విజ‌య‌వంతంగా చికిత్స పొంది డిశ్చార్జ‌యిన వారి సంఖ్య 91,34,209.

ప్ర‌పంచంలో ఈ విధంగా వైర‌స్ తీవ్ర‌త ఉండ‌గా.. కేవ‌లం కొన్ని దేశాల్లో మాత్రం ఉగ్ర‌రూపం దాలుస్తోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటు భార‌త‌దేశంలోనూ వైర‌స్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు అమెరికాలో న‌మోద‌య్యాయి. ఆ దేశంలో కేసులు 40,28,733, మరణాలు 1,44,958 సంభవించాయి. బ్రెజిల్ లో 21,66,532 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 81,597కు చేరింది. రష్యాలో 7,89,190 కేసులు, 12,745 మరణాలు నమోదయ్యాయి. ఇక భారత‌దేశం‌లో కేసులు 10,55,932 నమోదవ‌గా, మృతుల సంఖ్య 26,508కి చేరింది. తాజాగా కొత్తగా 37,724 పాజిటివ్ కేసులు, 648 మరణాలు సంభవించాయి.