Begin typing your search above and press return to search.
మీ క్రియేటివిటీ తగలెయ్య! కండోమ్‌ల రూపంలో గ్లౌజులు
By: Tupaki Desk | 17 Oct 2020 11:30 PM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో జనం ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగత శుభ్రతపై బాగా దృష్టి పెట్టారు. శుభ్రతకు సంబంధించిన సరంజామా లేకుండా బయట కూడా పెట్టడం లేదు. కరోనా స్టార్ట్ అయిన మొదట్లో కరోనా నుంచి తప్పించుకునేందుకు రక్షణ పరికరాలు అంతగా లేవు. సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు వాటితో పాటు శానిటైజర్ మాత్రమే అందుబాటులో ఉండేది.సరి పడా ఎన్-95 మాస్కులు కూడా లేవు. మరోవైపు కరోనా నిరోధానికి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ తయారయే పరిస్థితి లేదని వైద్య నిపుణులు ప్రకటించటంతో కంపెనీలన్నీ కరోనా రక్షణ పరికరాల తయారీ ఆవిష్కరణలో శ్రద్ధ పెట్టాయి. ఆ తరవాత బోలెడన్ని రకాల మాస్కులు, శానిటైజర్ లు, ఫేస్ షీల్డులు మార్కెట్ లోకి వచ్చాయి. బయటకు వెళ్ళిన సమయంలో ఏటీఎం, లిఫ్ట్ బటన్లు, తలుపులు ఇలా వేటిని పడితే వాటిని ముట్టుకోకుండా ఉండేందుకు గ్లౌజులు కూడా వచ్చాయి.
అచ్చు కండోమ్‌ల రూపంలో గ్లౌజులు
కొత్త ఆవిష్కరణల్లో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు కొందరు వ్యాపారాలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో క్రియేటివిటీ మరీ పెరిగిపోయింది. కొన్ని సంస్థలు వినూత్నంగా ఆలోచించాయి. ఫింగర్ గ్లౌజులను కండోమ్స్ రూపంలో తయారు చేశాయి. ఇవి చూడటానికి కండోమ్స్ మాదిరిగా ఉండటంతో వినియోగదారులు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారట. బయటకు వెళితే తప్పనిసరిగా ఏదో ఒకదాన్ని ముట్టుకోకుండా ఉండలేం.అలాంటి సమయంలో తప్పనిసరిగా చేతికి రక్షణ పరికరాలు ధరించాల్సిందే. దీంతో ఫింగర్ గ్లౌజులు చూడటానికి కండోమ్ లాగా ఉన్నా వాటిని ధరించాల్సి వస్తోంది. ఐతే అందరికీ వీటిపై అవగహన లేకపోవడంతో కొందరు వీటిని కండోమ్స్ అని అనుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఫింగర్ గ్లౌజులు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వీటిని చూసి అవాక్కవుతున్నారు. ఓ పక్క జనాలు కరోనాతో అతలాకుతలం అవుతుంటే మీకు క్రియేటివిటీ కావల్సి వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.